Onion: ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం నిర్ణయం..
టమాటా ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకునేలోపే ఇప్పుడు ఉల్లి ధరలు పెరుగుతోన్నాయి. వచ్చే నెలలో ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఉల్లి ధరలను అదుపులో పెట్టుకునేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఉల్లి బఫర్ స్టాక్ విడుదల చేసింది. ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకాన్ని విధించింది.
తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థలు అనేక చోట్ల ఉల్లిని రాయితీపై ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రభుత్వం దేశీయంగా ఉల్లిని సేకరిస్తుంది. గత నాలుగు రోజుల్లో రైతుల నుండి 2,826 టన్నుల ఉల్లిపాయలను నేరుగా కొనుగోలు చేసినట్లు నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్) శనివారం తెలిపింది. క్వింటాల్‌కు రూ.2,410 చొప్పున కొనుగోలు చేశారు. NCCF మేనేజింగ్ డైరెక్టర్ అనీస్ జోసెఫ్ చంద్ర మాట్లాడుతూ, సహకార సంస్థ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని రైతుల నుంచి ఆగస్టు 22 నుంచి ప్రత్యక్ష సేకరణను ప్రారంభించింది.

మహారాష్ట్రలో దాదాపు 12-13 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. డిమాండ్‌ను బట్టి వాటి సంఖ్యను పెంచుతారు. గత నాలుగు రోజుల్లో 2,826 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశాం. మహారాష్ట్ర నుంచి ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి. మొత్తం లక్ష టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం హోల్ సేల్ ధర క్వింటాల్ ధర రూ.1900-2000 కంటే అధికంగా క్వింటాల్ రూ.2410 చొప్పున రైతుల నుంచి నేరుగా ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు.
ఈ ఏడాది ఉల్లి బఫర్ స్టాక్ లక్ష్యాన్ని మూడు లక్షల టన్నుల నుంచి ఐదు లక్షల టన్నులకు ప్రభుత్వం పెంచింది. దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు, సరఫరా ఉండేలా ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఎగుమతులపై నిషేధం కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వ సంస్థలు పెద్ద ఎత్తున ఉల్లిని కొనుగోలు చేస్తున్నాయి. లక్ష టన్నుల ఉల్లిని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్‌లను కోరింది. దీంతో పాటు ఉల్లిని కూడా ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది.


Click it and Unblock the Notifications