e-commerce: బీఐఎస్ గుర్తు లేకుండా బొమ్మలు విక్రయిస్తున్నారంటూ.. ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా స్నాప్‌డీల్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. హ్యామ్లీస్, ఆర్చీస్ సహా వివిధ రిటైల్ స్టోర్ల నుంచి దేశవ్యాప్తంగా 18,600 ఆట వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), టాయ్స్ క్వాలిటీ కంట్రోల్ నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు కారణమని చెప్పింది. ఈ మేరకు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ (CCPA) కొరడా ఝళిపించిందని తెలిపింది.

ఫిర్యాదులు అందడంతో..
నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేని బొమ్మలు విక్రయిస్తున్నట్లు దేశీయ తయారీదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో నోటీసులు జారీ చేశామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) చీఫ్ నిధి ఖరే తెలిపారు. ఏడు రోజుల్లోగా వాటికి సమాధాన ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్‌లో ఉన్న హామ్లీస్, ఆర్చీస్, డబ్ల్యూహెచ్ స్మిత్, కిడ్స్ జోన్ మరియు కోకోకార్ట్‌తో సహా వివిధ షాపుల్లో సోదాలు చేసినట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ విలేకరుల సమావేశంలో చెప్పారు. వివిధ రిటైల్ దుకాణాలపై గత నెలలో 44 దాడులు నిర్వహించి పలు బొమ్మలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

చర్యలకు వెనకాడబోం
బీఐఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం అతిక్రమణదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రమోద్ కుమార్ తెలిపారు. ఎంత పెద్ద సంస్థలైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. క్వాలిటీతో కూడిన వస్తువులు ప్రజలకు అందేలా చూడటమే తమ కర్తవ్యమని.. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అనేది వస్తువుల ప్రమాణీకరణ, మార్కింగ్ మరియు నాణ్యత ధృవీకరణ జారీచేసే జాతీయ ప్రామాణిక సంస్థ కాగా.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) వినియోగదారుల హక్కలు, రక్షణకు బాధ్యత వహిస్తుంటుంది.

నోటీసులపై
ఇ-కామర్స్ సేవలను భారత్‌లో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి తమ సంస్థ ప్రయత్నిస్తోందని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. లక్షలాది చిన్న వ్యాపారాలను సాంకేతికత ద్వారా కనెక్ట్ చేసే విధంగా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. నిబంధనలకు లోబడి నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేందుకు మేము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. సీసీపీఏ నుంచి నోటీసులు అందుకున్నామని.. తగిన విధంగా సమాధానమిస్తామని వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications