adani: అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలు సుప్రీం కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. పిటిషన్ దారులు కోరుతున్న అంశాలపై కేంద్రం, మార్కెట్ నియంత్రణ సంస్థలు ఏమనుకుంటున్నాయో చెప్పాలని ఉన్నత న్యాయస్థానం గత శుక్రవారం ఆదేశించింది. ఈ పిల్ పై ఈరోజు మరోసారి విచారణ జరిగింది. కోర్టు సూచనల పట్ల కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ వెల్లడించారు.

కమిటీకి కేంద్రం ఓకే:
స్టాక్ మార్కెట్ లో అదానీ ఉదంతం తరహా అస్థిరతలను నివారించడానికి ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ విషయంలో తమకేమీ అభ్యంతరం లేదని ఈరోజు వెల్లడించింది. కొన్ని పేర్లను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. నియంత్రణ సంస్థల సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని మరోసారి స్పష్టం చేశారు.

ఈనెల 17కు వాయిదా:
మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పన్ను విధానాల వల్ల స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరిగుతోందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అదానీ వ్యవహారం కారణంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం ఏర్పడినట్లు కొన్ని నివేదికలు వెలువడినట్లు గుర్తు చేసింది. భవిష్యత్తులో ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఓ నిర్ధిష్ట విధానం రూపకల్పనకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని.. కేంద్రం, నియంత్రణ సంస్థలకు న్యాయస్థానం సూచించింది. కోర్టు సలహాను పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తరఫున SG తెలిపారు. కాగా.. విచారణను ఫిబ్రవరి 17కు ధర్మాసనం వాయిదా వేసింది.

బీమా సంస్థల ఎక్స్ పోజర్:
ప్రభుత్వ రంగ బీమా సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల్లో రూ.348 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఈరోజు ప్రకటించింది. వాటి మొత్తం నిర్వహణలోని ఆస్తి(AUM)లో ఇది 0.14 శాతమని వెల్లడించింది. బీమా దిగ్గజం LIC మొత్తం AUMలో 0.975 శాతం(దాదాపు 36 వేల కోట్లు) ఎక్స్ పోజర్‌ను కలిగి ఉన్నట్లు తెలిపింది.

పార్లమెంటులో ఆర్థిక శాఖ ప్రకటన:
న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలన్నీ కలిపి రూ.348 కోట్లు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు పార్లమెంటుకు ఆర్థిక శాఖ తెలిపింది. ఎగ్జిమ్ బ్యాంక్, SIDBI, NHB, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (NBFID), NABARD వంటి సంస్థలు చట్ట ప్రకారం సమాచారాన్ని బయటకు వెల్లడించలేవని పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications