Cement Stocks: ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలతో పాటు ఇన్వెస్టర్లు అత్యాశక్తితో ఎదురు చూశారు. పెట్టుబడి పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉంటాయని నమ్మకం కలిగిన తర్వాత ఇక ఇన్వెస్ట్ చేయడానికి రంగంలోకి దిగుతున్నారు. ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంతో సిమెంట్ స్టాక్స్ ప్రస్తుతం హార్ట్ కేక్స్ లా కనబడుతున్నాయి. దీంతో సదరు కంపెనీల షేర్లు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్న అంచనాలతో నిర్మాణరంగంపై ఇన్వెస్టర్ల ఫోకస్ మళ్లీంది. కూటమి విజయంతో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడ పలు నిర్మాణ కార్యకలాపాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ డిమాండ్ ఉపందుకుంది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సిమెంట్ వినియోగం భారీ స్థాయిలో పెరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సిమెంట్ ధరలతో పాటు కంపెనీల షేర్లు కూడా ఆకాశాన్ని అంటుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో దాల్మియా సిమెంట్ దూసుకుపోతుందని లెక్కలు కడుతున్నారు. దాదాపు 50 శాతానికి పైగా పెరుగుతుందని భావిస్తున్నారు. మరోసారి 52 వారాల గరిష్ఠ స్థాయి 2,430 టచ్ చేయవచ్చని చెబుతున్నారు. ఓరియంట్, రామ్కో కంపెనీలు సైతం 40 శాతం పైగా రిటర్న్స్ జనరేట్ చేయవచ్చని పేర్కొంటున్నారు. వీటిలో దాల్మియా సిమెంట్ లార్జ్ క్యాప్ కాగా మిగతా రెండు మిడ్ క్యాప్ క్యాటగిరీకి చెందినవి కావడం గమనార్హం.
ఇక స్మాల్ క్యాప్ విభాగంలోని NCL ఇండస్ట్రీస్, సాగర్ సిమెంట్స్ సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సాగర్ సిమెంట్ 35 శాతం, NCL దాదాపు 20 శాతం వరకు పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. రెండు స్టాక్స్ మరోసారి జీవితకాలం గరిష్ఠాలకు చేరుతాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో సిమెంట్ స్టాక్స్ ద్వారా మంచి రిటర్న్స్ జనరేట్ చేసేందుకు ఇన్వెస్టర్స్ రెడీ అవుతున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications