Cement News: సొంతిల్లు కట్టుకునేవారి బ్యాడ్ న్యూస్..సిమెంట్ డీలర్లు సంచలన నిర్ణయం..
Cement Rates Hike: డిసెంబర్ నెల ప్రారంభం నుంచి దేశంలోని సిమెంట్ డీలర్లు రేట్ల పెంపులను ప్రకటిస్తూనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి పెరిగిన డిమాండ్, పండుగల తర్వాత మెరుగైన కార్మికుల లభ్యత, మౌలిక సదుపాయాల రంగం నుంచి ఆర్డర్‌ల పెరుగుదల కారణంగా డీలర్లు ఈ పెంపుదలకి కారణమని చెబుతున్నారు.
సిమెంట్ ధరలు అత్యధికంగా ఉన్న పశ్చిమ భారతదేశంలో డీలర్లు 50 కిలోల సిమెంట్ బస్తా ధరలను రూ.5-10 మేర పెంచారు. ఇదే క్రమంలో దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. అయితే పశ్చిమ-ఉత్తర భారతంలోని రిటైల్ విక్రయ ధరల కంటే దక్షిణాది, తూర్పులో సిమెంట్ ధరలు తక్కువగానే ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో కొత్త సిమెంట్ ధరలు 50 కిలోల బస్తాకు దాదాపు రూ.350-400గా ఉన్నాయి. నాణ్యతతో పాటు బ్రాండ్ ఆధారంగా ధరల్లో కొంత మార్పు ఉన్నట్లు డీలర్లు చెబుతున్నారు.

ప్రధానంగా ధరలు తక్కువగా ఉన్న దక్షిణాది భారతదేశంలో సిమెంట్ ధరలు బస్తాకు రూ.40 చొప్పున అనేక సిమెంట్ కంపెనీలు పెంచాయని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. దీంతో 50 కేజీల సిమెంట్ బస్తా ధరలు ప్రస్తుతం రూ.320కి సమీపంలో కొనసాగుతున్నట్లు వారు చెబుతున్నారు. దేశీయంగా నిర్మాణ రంగం పుంజుకోవటంతో డిమాండ్ పెరిగినప్పటికీ తీవ్రమైన ధరల పెంపును అమలు చేయడం కష్టమని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణంగా దేశవ్యాప్తంగా అనేక సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటూ పోవటమేనని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద సిమెంట్ ప్లేయర్లు వాల్యూమ్‌లను, మార్కెట్ వాటాను పెంచుకునే క్రమంలో ధరల పెంపుదల వంటి చర్యలకు దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది.
అలాగే దీనికి ముందు సిమెంట్ తయారీదారులు, డీలర్లు సెప్టెంబర్‌లో ధరల పెంపునకు ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. మార్కెట్లో ధరల పెంపును పూర్తిగా గ్రహించడం ఇప్పటికీ జరగడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబరులో సిమెంట్ డిమాండ్ తగ్గిన తర్వాత ప్రస్తుతం తిరిగి గాడినపడుతున్నట్లు ప్రముఖ రేటింగ్ సమస్థ సీఎల్ఎస్ఏ ప్రకటించింది. అలాగే ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగం నుంచి డిమాండ్ పెరుగుతుందని జెఫరీస్ తన అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ధరల పెంపుతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా అనేక వస్తువుల ధరలు పెరగటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇక నిర్మాణంలో కీలకమైన సిమెంట్ ధరలు పెరగటం సొంతింటి కలను కష్టతరంగా మారుస్తుందని వారు చెబుతున్నారు.
సిమెంట్ ధరల పెరుగుదలతో లాభపడిన స్టాక్స్ ఇవే..
- అల్ట్రాటెక్ సిమెంట్స్
- ఏసీసీ సిమెంట్స్
- అంబుజా సిమెంట్స్
- దాల్మియా భారత్
- ఉదయ్‍పూర్ సిమెంట్
- స్టార్ సిమెంట్
- హిడెల్బర్గ్ సిమెంట్


Click it and Unblock the Notifications