ధరల తగ్గింపు వలన మధ్యతరగతి ఇంటి కల నిజమవుతుందా? మీ బడ్జెట్ ఎంత తగ్గొచ్చు
ఇప్పుడు భవన నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్! తాజా జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ముఖ్యమైన నిర్మాణ పదార్థాలపై పన్ను తగ్గించేశారు. దీని ఫలితంగా కొత్త ఇళ్ళు, అపార్ట్‌మెంట్స్ నిర్మాణ ఖర్చులు కొంతమేర తగ్గి, డెవలపర్స్‌కి కూడా ఊపిరి వస్తుంది.

ఏ పదార్థాల పై ఎంత తగ్గింపు?
సిమెంట్ పై పన్ను 28% నుండి 18%కి తగ్గించగా, ఇది ప్రతి ప్రాజెక్ట్‌లో పెద్ద భాగం ఖర్చు కాబట్టి మొత్తం నిర్మాణ ఖర్చులు కొంచెం సులభం అవుతాయి. అలాగే, మార్బుల్, ట్రావెర్టైన్ బ్లాక్స్ పన్ను 12% నుండి 5%కి తగ్గించబడింది. గ్రానైట్ బ్లాక్స్ కూడా 12% నుండి 5%కి వచ్చాయి, అదే సమయంలో సాండ్-లైమ్ బ్రిక్స్, స్టోన్ ఇన్లే వర్క్‌ల పన్ను కూడా 12% నుంచి 5%కి తగ్గించబడింది. దీని వల్ల ఫినిషింగ్, స్ట్రక్చరల్ మేటీరియల్స్ కొంచెం చవక అవుతాయి. నిర్మాణ బడ్జెట్‌కి సాయం అవుతుంది.
ఉదాహరణకి, ఒక 2BHK అపార్ట్‌మెంట్‌లో సుమారు 1000 sq. ft నిర్మాణం ఉంటే, సిమెంట్, మార్బుల్, గ్రానైట్, ఇలాంటి పదార్థాల ధరల్లో సుమారు 5% వరకు మొత్తం ఖర్చు తగ్గవచ్చు. అంటే, ఒక ప్రాజెక్ట్‌లో రూ. 20 లక్షల నిర్మాణ ఖర్చు ఉంటే, ఈ తగ్గింపుతో సుమారు రూ. 1 లక్ష వరకు పొదుపు అయ్యే అవకాశం ఉంది. చిన్న పొదుపులు కలిపి, హోంబయర్స్‌కి ఇళ్ళు కొంత చవకగా, లైట్‌గా లభించటం సులభం అవుతుంది.
ఈ తగ్గింపుల కారణంగా ఫినిషింగ్ మరియు స్ట్రక్చరల్ మెటీరియల్స్ కొంత చవక అవుతాయి. దీని వల్ల డెవలపర్స్‌కు ఖర్చుల ప్లానింగ్ సులభమవుతుంది, అలాగే గృహ కొనుగోలుదారులు కూడా కొంత ఆర్థిక లాభం పొందగలుగుతారు.
NAREDCO నేషనల్ చైర్మన్ నిరంజన్ హిరనందని ఇలా అన్నారు. జీఎస్టీ రేషనలైజేషన్ వినియోగదారులకు సూపర్ లక్కీగా ఉందని, దీని వల్ల వాళ్ల కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడతుందని, మొత్తం భారత్ GDP వృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని అన్నారు.
CREDAI నేషనల్ అధ్యక్షుడు శేఖర్ పటేల్ ఇలా అన్నారు "సిమెంట్, మార్బిల్ వంటి పదార్థాల పన్ను తగ్గింపు రియల్ ఎస్టేట్‌కు రిలీఫ్. డెవలపర్స్ ఖర్చు కంట్రోల్ చేసుకోగలరు. హోమ్ బయర్స్‌కి 5% వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది." ధరల్లో తక్షణ మార్పు చూడడం కష్టం. ఎందుకంటే చాలా డెవలపర్స్ ఇప్పటికే కాంట్రాక్ట్స్‌లో నిండిపోయి ఉన్నారు. కొత్త రేట్లు, కొత్త కాంట్రాక్ట్స్‌లోనే వాస్తవంగా ప్రభావం చూపిస్తాయి.
జీఎస్టీ తగ్గడం వల్ల మిడ్-ఇన్‌కమ్, ప్రీమియం హౌసింగ్ డిమాండ్ పెరుగుతోంది. ఇన్‌పుట్ ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల కొత్త ప్రాజెక్ట్‌లను ఆలస్యంగా ప్రారంభించేవారు. ఇప్పుడు, తక్కువ ఖర్చుతో కొత్త ప్రాజెక్ట్‌లు వేగంగా మొదలవుతాయి. ఈ రీఫార్మ్‌తో హోమ్ బయర్స్‌కి ఎక్కువ ఆఫర్లు, చవకైన ధరల్లో ఇళ్లు లభించే అవకాశం ఉంది.
జీఎస్టీ కౌన్సిల్ నిర్మాణ పదార్థాలపై పన్ను తగ్గించడం హౌసింగ్ రంగానికి బూస్ట్, వినియోగదారులకి ఊరట, డెవలపర్స్‌కి ఖర్చు తగ్గింపు, ఆర్థిక వృద్ధికి ప్రేరణ ఇలా అన్ని ఒకేసారి. సింపుల్‌గా చెప్పాలంటే, ఇలాంటి నిర్ణయాలు ఇక భవన నిర్మాణం కొంచెం చవకగా, లైటుగా చేస్తాయి.


Click it and Unblock the Notifications