Cement Prices: ఇప్పటికే ఇసుక, ఇటుకలు, స్టీల్, కంకర వంటి ముడిపదార్ధాలతో పాటు ఇతర నిర్మాణ వ్యయాలు పెరిగి రియల్ ఎస్టేట్ పరిశ్రమి ఇబ్బంది పడుతోంది. మరో పక్క ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ మందగించటంతో చాలా చోట్ల పనులు నిలిచిపోయాయి. ఈ సమయంలో మళ్లీ సిమెంట్ రేట్లు భారీగా పెరుగుతున్నాయనే వార్త రియల్టర్లతో పాటు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న సామాన్యుల్లోనూ గుబులు పుట్టిస్తోంది.

సిమెంట్ కంపెనీల ఆలోచన..
వ్యాపారాలను కాపాడుకోవటం కోసం కంపెనీలు రేట్ల పెంపును ఎంచుకున్నట్లు సమాచారం. గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ నివేదిక ప్రకారం నవంబర్‌లో సిమెంట్ ధరను బస్తాకు రూ.10 నుంచి రూ.30 వరకు పెంచాలని యోచిస్తున్నాయని వెల్లడైంది. గత నెలలో ఇప్పటికే బస్తాకు మూడు నుంచి నాలుగు రూపాయలు పెరగగా.. మళ్లీ 10-30 రూపాయల వరకు పెంచేందుకు సిమెంట్ కంపెనీలు సిద్ధమౌతున్నాయి.

ఆ కారణంతో..
సిమెంట్ ఉత్పత్తి, ముడిసరుకు ధరల ఆధారంగా ప్రతి నెలా సిమెంట్ బస్తా ధర 2 నుంచి 3 శాతం పెరుగుతోంది. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఒక శాతం, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు శాతం మధ్య సిమెంట్ ధరలు పెరుగుతాయని గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ పేర్కొంది. అందుకే నవంబర్‌లో సిమెంట్ కంపెనీలు దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలను రూ.10-30 మధ్య పెంచాలని చూస్తున్నాయని వెల్లడించింది.

డిమాండ్ పెరుగుదల..
వర్షాకాలం, పండుగల జాప్యం కారణంగా అక్టోబర్‌లో నిర్మాణ రంగం చాలా నష్టపోయిందని.., అదే సమయంలో అక్టోబర్‌లో కార్మికుల కొరత ఏర్పడిందని తెలుస్తోంది. అయితే పండుగలు ముగియటంతో కంపెనీలు రేట్లు పెంచే పనిలో పడ్డారు. అక్టోబర్‌లో పండుగల సీజన్ కారణంగా సిమెంట్ ధరల ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది. రానున్న రోజుల్లో నిర్మాణరంగం మరింతగా పెరగనున్నందున సిమెంట్ ధర కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అంతర్జాతీయంగా..
సిమెంట్ ధరల పెంపుతో నిర్మాణ రంగానికి ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సిమెంట్ ముడిసరుకు ధర దాదాపు 30 శాతం తగ్గింది. దీంతో సిమెంట్ ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని రియల్ ఎస్టేట్ రంగం చెబుతోంది. కానీ సిమెంట్ కంపెనీలు మాత్రం ధరను పెంచే యోచనలో ఉండటం పెద్ద షాక్‌కు కారణమైంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications