IPO News: ఒక్కో షేరుపై రూ.190 లాభం.. తొలిరోజే తుఫాను లాభాలను ఇచ్చిన ఐపీవో..
IPO News: నేడు మార్కెట్లోకి వచ్చిన ఐపీవో తన ఇన్వెస్టర్లకు రూపాయల్లో కాదు వందల్లో లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో అనేక మంది పెట్టుబడిదారులు సంతోషంలో తేలియాడుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సెల్లో వరల్డ్ లిమిటెడ్ ఐపీవో లిస్టింగ్ గురించే. ఈ కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈతో పాటు బీఎస్ఈలో జాబితా చేయబడ్డాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు తొలిరోజే బలమైన లాభాలను అందుకున్నారు. బీఎస్ఈలో స్టాక్ ధర రూ.831 రేటు వద్ద, ఎన్ఎస్ఈలో రూ.829 వద్ద జాబితా చేయబడింది. ఈ క్రమంలో షేర్లు తొలిరోజే 29.16 శాతం ప్రీమియం లిస్టింగ్ కారణంగా షేర్లు పొందిన ఇన్వెస్టర్లు ఊహించని లాభాలను అందుకున్నారు. ఈ క్రమంలో ఎన్ఎస్ఈ ఇంట్రాడేలో షేర్ గరిష్ఠంగా రూ.837.40 రేటును తాకింది.

వాస్తవానికి సెల్లో వరల్డ్ లిమిటెడ్ కంపెనీ తన షేర్ ప్రైస్ బ్యాంక్ రూ.617 నుంచి రూ.648గా ఉంచింది. సెల్లో వరల్డ్ లిమిటెడ్ IPO 30 అక్టోబర్ నుంచి 1 నవంబర్ 2023 వరకు తెరవబడింది. కంపెనీ ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.1,900 కోట్లను సమీకరించింది. ఈ క్రమంలో తన ఉద్యోగుల కోసం 170357 షేర్లను రిజర్వ్ చేసింది. వారికి ఒక్కో షేరును రూ.61 తగ్గింపు ధరకు అందించింది. యాంకర్ ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొని రూ.567 కోట్లను పెట్టుబడిగా పెట్టారు.
సెల్లో వరల్డ్ లిమిటెడ్ ఐపీవో మూడవ రోజున 41 కంటే ఎక్కువ రెట్లు సభ్యత్వాన్ని పొందింది. చివరి రోజున ఐపీవో రిటైల్ కేటగిరీలో 3.21 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగంలో 122.20 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 25.65 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. సెల్లో వరల్డ్ లిమిటెడ్ ఐపీవో లాట్ పరిమాణం 23 షేర్లుగా ఉంది. అంటే ఎవరైనా పెట్టుబడిదారులు కంపెనీ ఐపీవోలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.14,904 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications