Celebrity Betting Scam: టాలీవుడ్‌లో భారీ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం రేపుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన పెద్ద స్కాంలో ఒకటైన బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించింది. ప్రముఖ తెలుగు నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్లు శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి తదితరులపై ఈడీ కేసు నమోదు చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు మనీలాండరింగ్ చట్టాల కింద విచారణను ఎదుర్కొననున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

పోలీసులు ఇప్పటికే 19 మంది యాప్ యజమానులపై కేసు నమోదు చేశారు.విచారణకు గురైన యాప్‌లలో జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధని బుక్ 365, మామ 247, తెలుగు 365, ఎస్365, జై365, జెట్ ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్ర365 ఉన్నాయి. ఈ కేసు భారతీయ న్యాయసంహిత సెక్షన్లు 318(4), 112, రెడ్‌విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 3(ఎ), 4, అలాగే ఐటీ చట్టం 2000, 2008 సెక్షన్ 66డి కింద నమోదు చేశారు. ఈడీ ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటీసులు పంపించి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేయడానికి సిద్ధమవుతోంది. విచారణ మరింత ముమ్మరంగా సాగే అవకాశముంది.
గతంలో నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి టీమ్స్ దీనిపై స్పష్టత ఇచ్చారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు వారు ఎప్పుడూ ప్రచారం చేయలేదని, చట్టబద్ధమైన అనుమతులు ఉన్న నైపుణ్యాధారిత గేమింగ్ యాప్‌లకు మాత్రమే ప్రచారం చేశామని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ తన టీమ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో "ఏ23" అనే యాప్‌తో చేసిన ప్రచార ఒప్పందం ఇప్పటికే ముగిసిపోయిందని, ప్రస్తుతం ఆ యాప్‌తో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఇదే తరహాలో రానా దగ్గుబాటి టీమ్ కూడా స్పందిస్తూ, రానా ఒప్పందం 2017లోనే పూర్తయ్యిందని వెల్లడించారు. చట్టపరమైన అనుమతులు ఉన్న యాప్‌లకు మాత్రమే తాము ప్రచారం చేశామని, నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. 2016లో తాను కుదుర్చుకున్న ఒప్పందం అప్పుడే ముగిసిందని, ప్రస్తుతం ఎలాంటి ప్రమోషన్‌లలో భాగం కావడం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ కేసులో పలువురు సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు హైదరాబాద్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ల కారణంగా అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications