Suspicious Transactions: అత్యంత పురాతనమైన, పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియాకు మంచి పేరు ఉంది. కాగా ఇప్పుడు భారత్‌లో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ సహా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల సమయం కావడంతో రోజువారీ జరిగే అనుమానాస్పద లావాదేవీలను ఎప్పటికప్పుడు తమకు అప్డేట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఎన్నికలలో ధన ప్రవాహానికి అడ్డుకట్టలు వేసే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇక ఈడీ వంటి ఏజెన్సీలు మద్యం, నగదు, ఉచితాలు, మాదకద్రవ్యాల ప్రవాహానికి అడ్డుపడనున్నారు.

'ఎన్నికలు డబ్బుతో కూడుకున్న వ్యవహారమని నాకు తెలుసు. ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వర్తించడం మా బాధ్యత. ఇందుకోసం NPCI, GST మరియు బ్యాంకులు వంటి అధీకృత సంస్థలు అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్‌ను ట్రాక్ చేస్తాయి. ఈ తరహా ఆదాయానికి సోర్స్ నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం పూర్తిగా వినియోగదారుడిదే' అని CEC తెలిపారు.
మొత్తం మీద 97 కోట్ల మంది ఓటర్ల లిస్టులో నమోదయ్యారు. వీటిలో 1.5 కోట్ల మంది సిబ్బంది ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కాగా ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరిపి తమ సత్తా చాటాలని CEC చూస్తోంది.


Click it and Unblock the Notifications