CDSL News: సరికొత్త రికార్డు సృష్టించిన సీడీఎస్ఎల్.. ఏకంగా 10 కోట్ల డీమ్యాట్ ఖాతాలు..
Demat Accounts: కరోనా ఏమ్మాయ చేసిందో కానీ.. అప్పటి నుంచి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. లాభాలతో సంబంధం లేకుండా అనేక మంది తమ డబ్బును స్టాక్ మార్కెట్లలో డంప్ చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మంచి రాబడిని పొందాలని నేటి కాలం యువత, ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ లో నష్టపోయే అవకాశం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పెద్ద నష్టాలను తప్పించుకోవచ్చు. అందుకే లక్షల్లో కాకుండా ఏకంగా కోట్లలో ప్రజలు తమ డబ్బును స్టాక్ మార్కెట్లలోకి తీసుకొస్తున్నారు. దీంతో సీడీఎస్ఎల్ కంపెనీ ఒక అద్భుతమైన మైలురాయిని అందుకుంది.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు, ట్రేడింగ్ కోసం డీమ్యాట్ ఖాతా అవసరం. ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన షేర్లను సురక్షితంగా ఉంచడానికి డీమ్యాట్ ఖాతా ఒక మాధ్యమంగా నిలుస్తుంది. కొనుగోలు చేసిన షేర్లను విక్రయించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఈ క్రమంలోనే దేశంలో డీమ్యాట్ ఖాతాలు ఉన్నవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఈ సంఖ్య ఇప్పుడు 10 కోట్లకు పైగా పెరిగింది. దేశ ప్రజలు స్టాక్ మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారని ఈ ట్రెండ్ రుజువు చేస్తోంది.
సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ తన ప్లాట్‌ఫారమ్‌లో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్లు మైలురాయిని అందుకున్నట్లు బుధవారం ప్రకటించింది. CDSL 1999లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్ రూపంలో స్టాక్ ఎక్స్ఛేంజీలలో సెక్యూరిటీలు, లావాదేవీలు, ఒప్పందాలను నిర్వహించడం సులభతరం చేస్తుంది.


Click it and Unblock the Notifications