Flipkart News: దేశీయ ఇ-కామర్స్ రంగంలో అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లు రారాజులుగా కొనసాగుతున్నాయి. వేరొకరు ఎదురు లేకుండా కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నాయి. కేవలం మొబైల్‌లో ఆర్డర్ చేస్తే నచ్చిన వస్తువు ఇంటికి వచ్చేస్తుండటంతో వినియోగదారులు విపరీతంగా ఆకర్షితులయ్యారు. కానీ ఈ వ్యాపారాలు ఎంతవరకు న్యాయబద్ధంగా జరుగుతున్నాయి అని ఇప్పటి వరకు ఎవరూ ఆలోచించలేదు.
శామ్‌సంగ్, షియోమీ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లతో పాటు అమెజాన్ మరియు ప్లిప్‌కార్ట్‌లు ఇప్పుడు యాంటీట్రస్ట్ పరిశీలనను ఎదుర్కొంటున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఈ కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యేకమైన ఉత్పత్తి లాంచ్‌లలో పాల్గొన్నాయని, ఇది పోటీని పరిమితం చేసి చిన్న వ్యాపారాలకు హాని కలిగించవచ్చని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) గుర్తించినట్లు పేర్కొంది.

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా తమ ఉత్పత్తులను ప్రత్యేకంగా లాంచ్ చేయడానికి భారతదేశ పోటీ చట్టాలను ఉల్లంఘించారని CCI ఆరోపించింది. తద్వారా చిన్న ప్లేయర్స్‌ను బాధించడమే కాకుండా కొంతమంది విక్రేతలు మరియు ఉత్పత్తులకు అన్యాయమైన ప్రయోజనాన్ని కూడా అందించినట్లు కనుగొందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
అమెజాన్‌పై జరిపిన పరిశోధనల అనంతరం CCI 1,027 పేజీల నివేదిక విడుదల చేసింది. శామ్‌సంగా, షియోమీ, మోటోరోలా, రియల్‌మీ మరియు వన్ ప్లస్ కు చెందిన భారతీయ యూనిట్లు పోటీ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని అందులో పేర్కొంది. అమెజాన్ మరియు దాని అనుబంధ సంస్థలు సమన్వయంతో ప్రత్యేకమైన ఫోన్ లాంచ్‌లలో పాల్గొన్నాయని ఆరోపించింది. అదేవిధంగా పలు మొబైల్ బ్రాండ్‌లు ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లోనూ ఇదే తరహా పద్ధతుల్లో నిమగ్నమైనట్లు 1,696 పేజీల నివేదిక రిలీజ్ చేసింది.
రాబోయే వారాల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ప్రమేయం ఉన్న స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే CCI సమీక్షిస్తుంది. ఈ సమీక్షల ఆధారంగా కమిషన్ జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ కంపెనీల వ్యాపార పద్ధతుల్లో మార్పులు అవసరమని భావిస్తోంది. ప్రత్యేక ఆన్‌లైన్ లాంచ్‌ల గురించి భారతీయ రిటైలర్లు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఫిజికల్ రీటైలర్‌లను కూడా వీటి పద్ధతుల వల్ల ప్రభావితమయ్యారు. కాగా ఇప్పుడు వారికి సాంత్వన లభించనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications