న్యూఢిల్లీ: కొంతకాలంగా రెండు కార్పొరేట్ బిగ్ షాట్స్ అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య నడుస్తోన్న వివాదానికి తెర పడినట్టే కనిపిస్తోంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివాదంలో- అపర కుబేరుడు జెఫ్ బెజొస్ సారథ్యంలోని అమెజాన్ కంపెనీకి భారీ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఈ పెనాల్టీ విలువ 200 కోట్ల రూపాయలు. ఈ వ్యవహారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన పంతాన్ని నెగ్గించుకున్నట్టయింది.
ఈ వివాదం నేపథ్యంలో కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌కు బిగ్ రిలీఫ్ దక్కినట్టయింది. దేశవ్యాప్తంగా బిగ్‌బజార్ చెయిన్ రిటైల్స్, షాపింగ్ మాల్స్‌ను లీడ్ చేస్తోన్న సంస్థ ఇది. అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన ఈ డీల్‌ను రద్దు చేస్తున్నట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. నిజానికి- ఈ డీల్‌కు అనుమతి ఇచ్చిందే సీసీఐ. 2019లో అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య ఈ డీల్ కుదిరింది. దీన్ని ఇప్పుడు తాజాగా రద్దు చేసింది .
నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా అమెజాన్ సంస్థకు 200 కోట్ల రూపాయల భారీ జరిమానా సైతం విధించింది సీసీఐ. ఫ్యూచర్ గ్రూప్‌ను ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. టేకోవర్ చేయడానికి ఉన్న అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయినట్టేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ఆస్తులను టేకోవర్ చేయడానికి రిలయన్స్ రిటైల్ 24,713 కోట్ల రూపాయలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

అప్పటికే ఈ ఫ్యూచర్ కూపన్స్ గ్రూప్‌లో అమెజాన్ 49 శాతం మేర పెట్టుబడులను పెట్టింది. దీని విలువ 200 మిలియన్ డాలర్లు. తనకు ఇప్పటికే వాటాలు ఉన్నందున.. ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య కుదిరిన టేకోవర్ ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకించింది. జెఫ్ బెజొస్ అభ్యంతరాలను బేఖాతర్ చేసింది. దీనితో అమెజాన్.. కోర్టుకెక్కింది. ప్రస్తుతం ఈ డీల్ వివాదం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. అదే సమయంలో ఫ్యూచర్ గ్రూప్.. సీసీఐని ఆశ్రయించింది.
మొత్తం ఈ వ్యవహారాన్ని పరిశీలించిన తరువాత- అమెజాన్ సంస్థ తీరును తప్పు పట్టింది. నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. ఫ్యూచర్ గ్రూప్ కోరుకున్న విధంగా అమెజాన్‌తో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా 200 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. దీనిపై 60 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే వెసలుబాటును అమెజాన్ సంస్థకు ఇచ్చింది. సరైన ఆధారాలతో తమను సంప్రదించాలని సూచించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications