CCI slaps meta: ఈ రోజుల్లో డేటా షేరింగ్, డేటా బ్రీచ్ గురించి మనం తరచుగా చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) మెటా( వాట్సాప్ పేరెంట్ కంపెనీ) పై రూ. 213.14 కోట్ల జరిమానా విధించింది. వాట్సాప్ 2021 ప్రైవసీ విధానాన్ని ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించారు. ఇందుకు కారణం WhatsApp, Facebook వంటి ఇతర మెటా సంస్థల మధ్య డేటా షేరింగ్‌ను మెటా తప్పనిసరి చేసింది, దింతో యూజర్ ప్రైవసీ గురించి ఆందోళనలను లేవనెత్తింది .
యాంటీ-ట్రస్ట్ రెగ్యులేటర్ ఆదేశాలు జారీ
దీని పై CCI రెండు సంబంధిత మార్కెట్‌లను గుర్తించింది. ఒకటి భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా OTT మెసేజింగ్ యాప్స్ మరొకటి భారతదేశంలో ఆన్‌లైన్ డిస్ ప్లే యాడ్స్. వీటిలో WhatsApp ఆధిపత్యంగా ఉండగా ఇంకా మెటా ప్రముఖ స్థానంలో ఉంది.

2021 ప్రైవసీ విధానం ప్రకారం, యూజర్లు WhatsAppను ఉపయోగించదాడానికి డేటా కలెక్షన్ అండ్ Facebookతో తప్పనిసరి షేరింగ్‌ని అంగీకరించాలి. CCI ఈ టేక్-ఇట్-ఆర్-లీవ్-ఇట్ విధానాన్ని అన్యాయమైన షరతుగా పరిగణించింది, ఇలా చేయడం కాంపిటేషన్ చట్టం, 2002లోని సెక్షన్ 4(2)(a)(i)ని ఉల్లంఘించినట్లే. దీనికి తోడు వాట్సాప్ యూజర్ డేటా (సెక్షన్ 4(2)(సి))ని ఉపయోగించుకోవడం ద్వారా ఆన్‌లైన్ డిస్‌ప్లే అడ్వర్టైజింగ్ మార్కెట్‌లో పోటీదారులకు ఎంట్రీ పై అడ్డంకులు సృష్టించినందుకు మెటాని దోషిగా CCI కనుగొంది.
కాంపిటేషన్-వ్యతిరేక పద్ధతులను అరికట్టడానికి, CCI మెటా అండ్ వాట్సాప్‌లకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది, వీటిలో ముఖ్యమైనవి ప్రకటనల కోసం డేటాను షేర్ చేయడం. దీని ప్రకారం వాట్సాప్ ఐదేళ్లపాటు ప్రకటనల కోసం మెటా కంపెనీలతో యూజర్ డేటాను షేర్ చేయడం నిషేధించబడింది. అయితే మెరుగైన ట్రాన్స్పరెన్సీ కూడా ఖచ్చితం చేసింది, దీనిలో WhatsApp మెటా కంపెనీలతో షేర్ చేసిన డేటాను స్పష్టంగా వివరించాలి. ఇంకా, ఆప్ట్-అవుట్ ఆప్షన్ కింద యాప్‌లో నోటిఫికేషన్స్ అండ్ యాప్ సెట్టింగ్‌ల ద్వారా సర్వీస్-సంబంధిత డేటా షేరింగ్‌ని నిలిపివేయగల అప్షన్ యూజర్లకు ఉండాలి.
వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌పై దర్యాప్తు
జనవరి 2021లో ప్రకటించిన పాలసీ అప్‌డేట్ యూజర్స్ డేటాను WhatsApp పేరెంట్ సంస్థ Facebook (ఇప్పుడు Meta)తో షేర్ చేసుకోవాలని లేదా ప్లాట్‌ఫారమ్‌కు యాక్సెస్ కోల్పోయే ప్రమాదం ఉందని తప్పనిసరి చేసింది. దీని ద్వారా యూజర్ ప్రైవసీ ఇంకా డేటా భద్రతపై హెచ్చరికను పెంచింది ఇంకా ప్రపంచవ్యాప్తంగా యూజర్ల నుండి ఎదురుదెబ్బ తగిలింది. అయితే గతంలో కూడా డేటా షేరింగ్ సంబంధించి చాల వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి మీకు తెలిసిందే.


Click it and Unblock the Notifications