Reliance: అంబానీకి శుభవార్త.. మెట్రో క్యాష్ & క్యారీ కొనుగోలుకు సీసీఐ గ్రీన్ సిగ్నల్..
Metro Stores: హోల్ సేల్ వ్యాపారంలో ఉన్న జర్మన్ సంస్థ మెట్రో క్యాష్ అండ్ క్యారీ తన భారత వ్యాపారాన్ని క్లోజ్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెట్రో స్టోర్లను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ వెంచర్ లిమిటెడ్ కొనుగోలుకు డీల్ చేసుకున్న సంగతి తెలిసిందే.
కాంపిటీషన్ కమిషన్..
రిలయన్స్ మెట్రో డీల్ కు తాజాగా కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఆమోదం తెలిపింది. "C-2023/02/1000 కమిషన్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ద్వారా మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి ఆమోదిస్తుంది." అంటూ సీసీఐ ట్వీట్ చేసింది.

డీల్ వివరాలు..
డిసెంబర్ 2022లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రూ.2,850 కోట్లకు మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాను పూర్తిగా కొనుగోలు చేసేందుకు ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ కొనుగోలులో భాగంగా మెట్రో సంస్థకు దేశవ్యాప్తంగా అమృత్‌సర్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ఘజియాబాద్, గుంటూరు, హైదరాబాద్, హుబ్బల్లి, ఇండోర్, లక్నో, కోల్‌కతా, ముంబై, నాసిక్, సూరత్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఉన్న స్టోర్లను రిలయన్స్ రిటైల్ వినియోగించుకునేందుకు వెసులుబాటు కలగనుంది. దీంతో మెట్రో ఇండియా స్టోర్ల నెట్‌వర్క్ ఇకపై అంబానీ ఆధీనంలోకి రానున్నాయి.

రిలయన్స్ రిటైల్..
గత కొన్ని నెలలుగా అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరణ జరుగుతోంది. కొత్త వ్యాపారాలను కొనుగోలు చేయటంతో పాటు అనేక వ్యాపారాల్లో కంపెనీ మెజారిటీ వాటాలను కొనుగోలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల శీతలపానీయాల రంగంలో కాంపా కోలా, కాంపా లెమన్, కాంపా ఆరెంజ్ పేరుతో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి లాంచ్ చేసింది. RIL గత ఏడాది దాదాపు రూ.22 కోట్లకు ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుండి క్యాంపాను కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications