CBN Effect: ఒకప్పుడు నేషనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలను పట్టించుకునేవి కాదు. మరీ ముఖ్యంగా యూపీ వంటి పెద్ద రాష్ట్రాల్లో గెలిస్తే చాలనుకుని.. దక్షిణాది రాష్ట్రాల మాటలను పెడచెవినపెట్టేవి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏపీ, తెలంగాణలోని సీట్లు మోదీ ప్రధాని కావటానికి చాలా కీలకంగా మారాయి.
ఈ క్రమంలో ఉదయం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి తాము ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగనున్నట్లు తేల్చి చెప్పటంతో స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ఆ ఒక్క మాటతో నష్టాల నుంచి మార్కెట్లు భారీ లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.

దీంతో నేడు ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల భారీ నష్టం నుంచి కాపాడపడింది. మార్కెట్లు ముగింపు నాటికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 2303 పాయింట్లు, నిఫ్టీ 736 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 2126 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2116 పాయింట్ల భారీ మెజారిటీతో ప్రయాణాన్ని ముగించాయి.
ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్జూమర్, కోటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ప్రయాణాన్ని ముగించాయి. అయితే మార్కెట్లు ముగింపు సమయంలో కేవలం ఎల్ టి, బీపీసీఎల్ కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలతో టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications