Thalliki Vandanam: గత వైసీపీ ప్రభుత్వం సమయంలో పేద విద్యార్థులకు జగన్ సర్కార్ అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. దీనికింద ఇంట్లో ఉన్న పిల్లలను పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించటం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని కింద అప్పటి సర్కార్ కొన్ని నిబంధనలు పెట్టి ఇంట్లో ఒక్కరికి మాత్రమే అందించిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూటమి పార్టీ మ్యానిఫెస్టోలో దీనిని ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తించేలా చేస్తామని వాగ్ధానం చేసింన సంగతి తెలిసిందే. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాబు సూపర్ 6ను ప్రకటించగా వీటి అమలు మాత్రం నెమ్మదిగా కొనసాగుతోంది. అందుకే తల్లికి వందనం స్కీమ్ కూడా ఇప్పటి వరకు అమలులోకి రాలేదు. అయితే దీనినే వైసీపీ అస్త్రంగా మార్చుకుని చంద్రబాబు హామీలు అమలు ఆలస్యం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తోంది. తాజా బడ్జెట్లో రూ.9407 కోట్లను కేటాయించటం జరిగింది.

ఈ క్రమంలోనే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ అమలు కోసం నిధులను కేటాయించింది. మంత్రి నారా లోకేష్ కూడా త్వరలోనే స్కీమ్ కార్యరూపం దాల్చుతుందని ప్రకటించారు. అయితే తాజాగా సీఎం చంద్రబాబు దీనిపై కీలక ప్రకటన చేస్తూ పథకం రానున్న విద్యా సంవత్సరం అంటే మే నెల నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో సంతాన ఉత్పత్తిని పెంచాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి హామీ మేరకు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే.. అంతమంది పిల్లలకు సంవత్సరానికి తలో రూ.15,000 రాక కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీ చెల్లింపుల కారణంగా స్కీమ్స్ అమలు లేటవుతోందని చెప్పుకొచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గేది లేదన్న సీఎం సార్.. మే నెలలో తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది అని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందే మనీ ఇస్తామని అన్నారు. స్కీమ్ కింద 1- 12వ తరగతి చదివే వారికి స్కీమ్ వర్తిస్తుంది. కానీ మెుత్తాన్ని ఒక్క విడతలో ఇస్తారా లేక రెండు విడతలు చెల్లిస్తారా అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అలాగే స్కీమ్ మార్గదర్శకాలు తుది దశకు చేరుకుంటున్న వేళ వాటిని త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ సర్కార్ అప్పట్లో 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే దీనిని చెల్లించింది. కూటమి ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ అప్లై చేస్తుందో వేచి చూడాల్సిందే. వైసీపీ సర్కార్ రూ.15000లలో రెండు వేలు స్కూల్ పారిశుద్యం కోసం చెల్లించి మిగిలిన మెుత్తాన్ని పిల్లలకు అందించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications