GST News: వ్యాపారులకు అలర్ట్.. GST రిజిస్ట్రేషన్స్‌పై CBIC కీలక అప్‌డేట్.. సువిధ సెంటర్‌కు పరుగెత్తాల్సిందే
GST update: భాజపా ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరిన దగ్గర నుంచి ఒక్కొక్కటిగా పలు సంస్కరణలను ప్రవేశపెడుతూ, ఉన్నవాటికి మార్పులు చేస్తూ వస్తోంది. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరులైన ఆదాయపు పన్ను మరియు GSTలపై శ్రద్ధ వహిస్తోంది. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలిపేందుకు, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతోంది.
వస్తు, సేవల పన్ను(GST) నమోదుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మరియు కస్టమ్స్(CBIC) కీలక ప్రకటన చేసింది. డేటా అనలిటిక్స్ మరియు రిస్క్ పెరామీటర్స్ ఆధారంగా గుర్తించబడిన ట్యాక్స్ పేయర్స్ తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ ప్రామాణీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటివరకు ఇలా చేయని వారు తప్పనిసరిగా ఫోటో క్యాప్చర్ సహా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం GST సువిధ కేంద్రాన్ని సందర్శించాలని కోరింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేసింది.

CGST రూల్స్‌కు 2023లో చేసిన మార్పులు ప్రకారం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తరహా కేసుల్లో GST రిజిస్ట్రేషన్ మంజూరు చేసేందుకు దరఖాస్తుదారు వ్యక్తిగత ధ్రువీకరణ వర్తింపచేయబడింది. అయితే ఇప్పటికీ ఆధార్ ప్రామాణీకరణ ఐచ్ఛికమేనని సిర్మాక్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సీనియర్ న్యాయవాది అపూర్వ్ ఫిలిప్స్ తెలిపారు. 2022 మరియు 2024లో వచ్చిన సవరణల ఆధారంగా ఇందుకు కొన్ని షరతులు జోడించినట్లు చెప్పారు.
'డిసెంబర్ 26, 2022కి ముందు ఆధార్ ఆథెంటికేషన్ ఎంచుకున్న ట్యాక్స్ పేయర్స్‌కు తదుపరి ప్రక్రియ లేకుండానే రిజిస్ట్రేషన్ మంజూరు చేయబడింది. అయితే నకిలీ రిజిస్ట్రేషన్ల ముప్పును మరింత సమర్థవంతంగా అరికట్టడానికి, కొత్త రూల్స్ తీసుకొచ్చారు. డేటా అనలిటిక్స్ మరియు రిస్క్ పెరామీటర్ల ఆధారంగా నిర్దిష్ట వ్యక్తి ధ్రువీకరణ అవసరమని CBIC భావించిన సందర్భాల్లో తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది' అని ఫిలిప్స్ వివరించారు.


Click it and Unblock the Notifications