'తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన.. ఇంటి నుంచి పనిచేస్తూ రోజూ వేలల్లో ఆదాయం' ఇవి చూశారా..?
WFH Scam: కరోనా ఉద్ధృతి వేళ పలు కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించాయి. తద్వారా వర్క్ ఫ్రం హోంపై యువతలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీనికితోడు గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు కూడా ఇంటి నుంచి పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సరిగ్గా ఇదే వీక్నెస్ ను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు.
ఇంటి నుంచి పని చేస్తూ వేలల్లో సంపాదన అంటూ ఫోన్లకు మెసేజెస్, సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తుంటాయి. ఈ విధంగా పలువురు మోసాల బారిన పడుతున్నట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) హెచ్చరించింది. దేశ, విదేశాల్లోని స్కామర్లు వర్క్ ఫ్రం హోం జాబ్స్ పేరిట తేలికగా మోసం చేస్తున్నట్లు తెలిపింది. పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి, షెల్ కంపెనీలు ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్లు వెల్లడించింది.

భారతదేశంలో ఇదే అతిపెద్ద సైబర్ ఎనేబుల్డ్ మనీ లాండరింగ్ మోసమని CBI పేర్కొంది. ఈ తరహా మోసాలపై 'ఆపరేషన్ చక్ర 2' పేరిట దాడులు నిర్వహించి, వీటి వెనుకున్న పెద్ద నెట్వర్క్ చిక్కుముడి విప్పుతున్నట్లు ప్రకటించింది. పార్ట్ టైం జాబ్స్, పెట్టుబడి సాయం పేరిట మోసగాళ్లు బ్యాంకు ఖాతాలు, యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు గుర్తించామని తెలిపింది.
ప్రజలను మోసం చేసి మనీలాండరింగ్ కు పాల్పడుతున్న షెల్ కంపెనీల వెనుక చైనా లింకులు ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. అయితే మోసగిచేందుకు స్కామర్లు గూగుల్ ప్రకటనలు, బల్క్ SMS, సిమ్ బాక్స్ బేస్డ్ SMS, క్లౌడ్ సర్వీసెస్, ఫిన్ టెక్ కంపెనీస్ సహా API వంటి సాంకేతికతలను విరివిగా ఉపయోగిస్తున్నట్లు వివరించింది. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచించింది.


Click it and Unblock the Notifications