Banking fraud: అగ్రరాజ్యం అమెరికాను బ్యాంకింగ్ సంక్షోభం ఇటీవల గడగడలాడించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రపంచం ఆందోళనకు గురైంది. అయినప్పటికీ దేశీయ బ్యాంకింగ్ రంగం తట్టుకుని నిలబడ గలిగింది. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య Xలో చేసిన పోస్ట్ ఇప్పుడు కలవరపెడుతోంది.
కర్ణాటకలోని 3 సహకార బ్యాంకుల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని సాక్షాత్తూ ఆ రాష్ట్ర CM సిద్ధరామయ్య ఆరోపించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారాన్ని CBIకి అప్పగించేందుకు ఆమోదం లభించినట్లు Xలో పోస్ట్ చేశారు. గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్, వశిష్ఠ బ్యాంక్, గురు సావరిన్ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలు త్వరలోనే బయటపడతాయన్నారు.

'వేలాది మంది డిపాజిటర్లు ఎన్నో కలలతో తమ కష్టార్జితాన్ని ఈ బ్యాంకుల్లో పొదుపు చేసుకున్నారు. బ్యాంకర్ల మోసం కారణంగా వారి భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మోసపోయిన డిపాజిటర్లకు న్యాయం చేయాలని సభ లోపలా, బయటా గొంతు చించుకున్నాను. CBIతో విచారణ జరిపించాలని కోరుతూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పటికి అది సాకారమైంది' అని పేర్కొన్నారు.
శ్రీ గురు రాఘవేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, శ్రీ వసిష్ఠ క్రెడిట్ సౌహార్ద కో-ఆపరేటివ్ లిమిటెడ్, మరియు శ్రీ గురు సార్వబహుమ సౌహార్ద క్రెడిట్ మేనేజ్‌మెంట్ పై CBI విచారణ జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయా బ్యాంకుల బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు మరియు సిబ్బంది చేసిన కోట్లాది రూపాయల మోసాలను నిగ్గుతేల్చనున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications