ప్రముఖ చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ షాకిచ్చింది. అవినీతి, మోసం ఆరోపణలతో క్యాడ్‌బరీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ పైన సీబీఐ కేసు నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డిలో ప్రాంత ఆధారిత పన్ను ప్రయోజనాలు పొందేందుకు వాస్తవాలను తప్పుగా చూపి అవినీతికి పాల్పడిందని సీబీఐ పేర్కొంది. 2009-11 మధ్య కాలంలో క్యాడ్‌బరీ ఎక్సైజ్ అధికారులతో కుట్ర పన్నిందని, ఫైవ్ స్టార్, జెమ్స్ చాక్లెట్స్‌ని తయారు చేస్తోన్న హిమాచల్‌లోని తన కొత్త యూనిట్ కోసం రూ.241 కోట్ల విలువైన పన్ను లబ్ధీని పొందిందని సీబీఐ ఆరోపణ.
క్యాడ్‌బరీ అధికారులతో కుమ్మక్కై తప్పుడు రికార్డులను సమర్పించిందని, కొన్ని రికార్డులు తారుమారు చేసి ప్రాంతాల వారీగా లభించే రాయితీలను పొందినట్లు తెలిపింది. 2007లో హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీలో కర్మాగారం ఏర్పాటు చేసి మరో పదేళ్లు అదనంగా సుంకాలు, పన్ను రాయితీ పొందేలా ప్రతిపాదనలు చేసింది. ఆ తర్వాత కొత్త యూనిట్ నిర్మించకుండా 2005 నుండి ఉన్న కర్మాగారాన్నే కొంతమేర విస్తరించింది. 2010 జులైలో రెండో యూనిట్ లైసెన్స్ తీసుకుంది.

పన్న రాయితీలు పొందడానికి విధించిన గడువు ముగిసి అప్పటికే 4 నెలలు దాటింది. అంతేకాకుండా రెండవ యూనిట్‌కు పన్నురాయితీకి అర్హత లేదు. దీంతో సెంట్రల్ ఎక్సైజ్ అధికారులకు మధ్యవర్తుల ద్వారా లంచాలు ఇచ్చి రూ.241 కోట్ల మేర పన్ను రాయితీలు పొందింది. ఇందుకు రికార్డుల తారుమారు, లంచాల వ్యవహారం నడిచిందని సీబీఐ పేర్కొంది. అయితే పన్ను వివాదాలను 2019లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ స్కీం ద్వారా పరిష్కరించుకొన్నట్లు మాండెల్జ్ ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్ తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications