ఢిల్లీ: అదానీ ఎంటర్‌ప్రాజెస్ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (CBI) క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాజమాన్యంలోని సంస్థకు బొగ్గు సరఫరా చేసే ఒప్పందాన్ని అక్రమ పద్ధతుల్లో దక్కించుకునేందుకు ఈ కేసు నమోదయింది. బొగ్గు సరఫరా కాంట్రాక్టు పొందడంలో అవకతవకలు పాల్పడినందుకు అదానీ సంస్థపై కేసు నమోదు కావడంతో పాటు ఈ కాంట్రాక్టును ఆ సంస్థకు కట్టబెట్టిన నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ (NCCF) ఉన్నతాధికారులపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖ ఉప కార్యదర్శి ప్రేమ్‌రాజ్ కౌర్ సీబీఐకి ఫిర్యాదు చేశారు.

బొగ్గు సరఫరా కోసం..
ఢిల్లీ, హైదరాబాద్ కేంద్రాలుగా ఈ స్కాం జరిగినట్లుగా సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లకు ఆరు లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని 2010 జూన్ 29వ తేదీన నాటి ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ కార్యాలయం NCCF హైదరాబాద్ విభాగాన్ని కోరింది.

బహిరంగ టెండర్లు
బహిరంగ టెండర్లు పిలిచి తక్కువ ధరకు బొగ్గు సరఫరా చేసే సంస్థను అలాగే లాభాల్లో తమకు ఎక్కువ వాటా ఇచ్చే సంస్థను NCCF ఎంపిక చేసుకోవాలి. కానీ వీటిని పాటించకుండా మొదట 2.25 శాతం లాభం తీసుకుంటూ మహర్షి కోల్ లిమిటెడ్‌కు కాంట్రాక్ట్ అప్పగించింది. అనంతరం కాంట్రాక్ట్ రద్దు చేసి బహిరంగ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ముసాయిదాను తయారు చేసి ఆమోదించి, టెండర్లు పిలిచారు.

లాభాలు పేర్కొనని అదానీ
2010 జూలై 10న ఆరు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా అదానీ ఎంటర్‌ప్రాజెస్ లిమిటెడ్, మహేశ్వరి బ్రదర్స్ కోల్ లిమిటెడ్, వ్యోమ్ ట్రేడ్ లింక్స్ ప్రయివేటు లిమిటెడ్, స్వర్ణ ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్, గుప్తా కోల్ ఇండియా లిమిటెడ్, క్యోరీ ఓరెమెన్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి. ఇందులో గుప్తా కోల్ ఇండియా 11.3 శాతం, ఎంబీసీఎల్ 2.25 శాతం లాభాన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డాయి. మిగతా సంస్థలు లాభాన్ని టెండర్లో పేర్కొనలేదు.

అదానీకి టెండర్
ఆ తర్వాత అదాని మినహా మిగతా సంస్థల బిడ్స్ తిరస్కరించారు. అదానీ సంస్థతో కాంట్రాక్ట్ ఒప్పంద సంప్రదింపుల కోసం ఉన్నతాధికారిని నియమించారు. లాభంలో వాటా ఇచ్చే అంశం పేర్కొనకపోవడం వల్ల ఆ సంస్థ బిడ్‌ను తిరస్కరించడం కాకుండా సంప్రదింపులు జరిపారని అంటున్నారు. సంప్రదింపుల సందర్భంగా 2.25 శాతం వాటా ఇచ్చేందుకు అదానీ గ్రూప్ సిద్ధపడింది. దీంతో టెండరు అదే సంస్థకు కట్టబెట్టారు.

పదేళ్ల తర్వాత..
నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండరును అదానీ సంస్థకు కట్టబెట్టారని, ఇందుకు NCCF ఉన్నతాధికారులే కారణమని ప్రాథమిక దర్యాఫ్తులో తేలినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈ ముగ్గురితో పాటు అదానీ సంస్థ, గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తోంది. అయితే 2010లో అక్రమాలు జరిగితే పదేళ్ల తర్వాత ఫిర్యాదు వచ్చింది. దీనిపై అదానీ గ్రూప్ కూడా స్పందించింది. ఇది పాతది అని, సీబీఐ దర్యాఫ్తు ప్రాథమికమేనని పేర్కొంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications