Bank Fraud: చాలా కాలం తర్వాత బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసే మరో ఆర్థిక కుంభకోణం బయటపడింది. ముంబై ఆధారిత ఇన్‌ఫ్రా సంస్థ ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసినట్లు వెల్లడైంది.
ముంబైకి చెందిన యూనిటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసగించారనే ఆరోపణలతో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కంపెనీ ఎస్బీఐతో పాటు కన్సార్టియంను దాదాపు రూ.3,847.58 కోట్ల మోసగించినట్లు ఎఫ్ఐఆర్ ప్రకారం వెల్లడైంది.

ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా విషయం వెలుగులోకి వచ్చింది. కన్సార్టియంను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో నిందితులు నకిలీ లావాదేవీల ద్వారా.. అకౌంటింగ్ పుస్తకాల్లో తప్పుడు ఖర్చులను చూపి రుణ మెుత్తాన్ని స్వాహా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతర ఖాతాలకు అక్రమంగా డబ్బును మళ్లించారని గుర్తించారు.
గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌తో కొంతకాలం పనిచేసిన తర్వాత 1979లో కిషోర్ అవర్‌సేకర్ యూనిటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ కంపెనీని స్థాపించారు. 2012లో అగ్నిప్రమాదం తర్వాత మంత్రాలయ భవన పునరుద్ధరణ తర్వాత థాకరే కుటుంబ బంగ్లా మాతోశ్రీ నిర్మాణంతో సహా అనేక ప్రముఖ నిర్మాణ ప్రాజెక్టుల్లో పాల్గొంది. అలాగే 2000ల ప్రారంభం నుంచి2010-11 వరకు పెనీ ముంబై, హారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల్లో.. రోడ్ల నిర్మాణం, డ్యామ్ పటిష్టత, రైల్వే సొరంగాలు, మాల్స్, ఎత్తైన టవర్లు, తుఫాను నీటి కాలువలు వంటి అనేక ప్రాజెక్టుల్లో కంపెనీ పాల్గొంది.


Click it and Unblock the Notifications