DHFL Fraud: రూ.34,615 కోట్ల స్కామ్ కు సంబంధించిన తాజా కేసులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని మాజీ సీఎండీ కపిల్ వాధ్వన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వన్ తో పాటు మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇది ఏజెన్సీ ద్వారా దర్యాప్తు చేయబడిన అతిపెద్ద బ్యాంక్ మోసంగా మారిందని అధికారులు ఈ రోజు వెల్లడించారు. కేసు నమోదు తర్వాత 50 మందికి పైగా సీబీఐ అధికారుల బృందం ముంబైలో ఎఫ్‌ఐఆర్‌లో లిస్టెడ్ నిందితులకు చెందిన 12 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో అమరిల్లిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్ట, ఎనిమిది మంది ఇతర బిల్డర్లు కూడా ఉన్నారు.

ప్రత్యేక ఆడిట్..
వివిధ ఏర్పాట్ల కింద కన్సార్టియం నుంచి 2010- 2018 మధ్య కాలంలో కంపెనీ రూ. 42,871 కోట్ల లోన్లను పొందింది. అయితే మే, 2019 నుంచి తిరిగి చెల్లించే కమిట్‌మెంట్‌లను డిఫాల్ట్ చేయడం ప్రారంభించినట్లు బ్యాంక్ ఆరోపించిందని సీబీఐ అధికారులు చెప్పారు. దీని కారణంగా బ్యాంకులు డీహెచ్ఎఫ్ఎల్ కు చెందిన లోన్లను ఎన్పీఏలుగా ప్రకటించాయి.
నిధుల మళ్లింపు, రౌండ్ ట్రిప్పింగ్, నిధులను స్వాహా చేయడం ద్వారా మోసం గురించి దేశంలోని మీడియాలో నివేదికలు వెలువడిన తర్వాత జనవరి 2019లో DHFL దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఫిబ్రవరి 1, 2019న కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు సమావేశాన్ని నిర్వహించారు.

పారిపోకుండా చర్యలు..
ఏప్రిల్ 1, 2015 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు DHFL అకౌంట్లను, ఆర్థిక లావాదేవీలను స్పెషల్ ఆడిట్ నిర్వహించడానికి రుణ సభ్యులు KPMGని నియమించారు. ఈ క్రమంలో.. కపిల్, ధీరజ్ వాధ్వాన్ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు అక్టోబర్ 18, 2019న వీరిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. KPMG తన ఆడిట్‌లో లోన్స్ అండ్ అడ్వాన్స్‌ల రూపంలో నిధులను సంబంధం ఉన్న ఇతర సంస్థలకు, కొందరు వ్యక్తులకు అక్రమంగా మళ్లించిందని తెలిపింది.

అక్రమ ఆస్తులు కూడబెట్టారు..
DHFL ప్రమోటర్లతో ఉమ్మడిగా ఉన్న 66 సంస్థలకు రూ. 29,100.33 కోట్లు పంపిణీ చేయగా.. వాటి నుంచి రూ. 29,849 కోట్లు బకాయిలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. "అటువంటి సంస్థలు, వ్యక్తుల చాలా లావాదేవీలు భూమి, ఆస్తుల్లో పెట్టుబడుల రూపంలో ఉన్నాయి" అని బ్యాంక్ ఆరోపించింది. కపిల్, ధీరజ్ వాధ్వన్‌లకు ఆస్తులు సృష్టించేందుకు.. భారీగా ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు, బూటకపు లావాదేవీల కల్పన, నిధుల రౌండ్ ట్రిప్పింగ్ జరిగినట్లు ఆడిట్ వెలుగులోకి తెచ్చింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications