Swiss bank accounts: స్విస్ బ్యాంకుల నుంచి భారత్ చేతికి కొత్త లిస్ట్.. CBDT ఛైర్మన్ ఏమన్నారంటే..?
Swiss bank accounts: గతంలో స్విస్ బ్యాంకులు పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా ఉండేవి. పలువురు బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ సంపదను అక్కడికి తరలించి పన్నుపోటు నుంచి తప్పించుకునే వారు. అయితే వారి అకౌంట్స్ వివరాలను ఇండియాతో పంచుకోవడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం అంగీకరించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా కొత్త లిస్ట్ భారత్ చేతికొచ్చింది.
స్విస్ బ్యాంకుల్లో నగదు దాచుకున్న భారతీయుల ఖాతా వివరాల కొత్త లిస్ట్ అందినట్లు కేంద్రం తెలిపింది. అయితే దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) ఛైర్మన్ నితిన్ గుప్తా స్పందించారు. ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. ఏవైనా ఎగవేత, నల్లదనంకు సంబంధించిన మూలాలు దొరికితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

'వార్షిక ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్‌లో భాగంగా స్విస్ బ్యాంక్‌లోని భారతీయ పౌరుల, సంస్థల బ్యాంక్ ఖాతాల సమాచారం అందింది. స్విట్జర్లాండ్ దాదాపు 36 లక్షల ఆర్థిక ఖాతాల వివరాలను 104 దేశాలతో పంచుకుంది' అని నితిన్ గుప్తా తెలిపారు. తొలిసారిగా 2019లో భారత్‌తో ఈ సమాచార మార్పిడి జరిగ్గా.. ఇది ఐదోసారి.
'నేను రెండేళ్లకుపైగా స్విస్ రాయబారిగా ఉన్నాను. నల్లధనం గురించి దాదాపు ఎటువంటి సమాచారం వినలేదు. స్విట్జర్లాండ్ మరియు భారత్ మధ్య బ్యాంకింగ్ సమాచార మార్పిడి గురించి 2018లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. తద్వారా నల్లధనం సమస్య పరిష్కరించబడింది' అని స్విస్ రాయబారి తెలిపారు.


Click it and Unblock the Notifications