Cashless Payments: వేగంగా విస్తరిస్తున్న నగదు రహిత చెల్లింపులు వినియోగదారుల మధ్య వ్యయ ధోరణుల్లో మార్పులను తీసుకొచ్చాయి. డిజిటల్ చెల్లింపుల కారణంగా ప్రజలు గతంలో కంటే ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం, అడిలైడ్ విశ్వవిద్యాలయం నుంచి ఒక బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో ప్రజల ఖర్చుల అలవాట్లను వారు పరిశీలించారు.
ఏదైనా చెల్లింపులకు నోట్లు లేదా నాణేలను తీసుకోవడంతో పోల్చినప్పుడు ప్రజలు ఫోన్ లేదా కార్డ్‌ని ట్యాప్ పేమెంట్స్ చేసేటప్పుడు వారి బడ్జెట్‌తో తక్కువ కఠినంగా ఉంటున్నట్లు నివేదిక గమనించింది. ఈ క్రమంలో ప్లాన్ చేసుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా నిరోధించటానికి ప్రజలు కార్డులకు బదులుగా నగదును తీసుకెళ్లాలని నివేదిక బృందం సిఫార్సు చేస్తోంది. వాస్తవానికి ఇది స్వీయ నియంత్రణ పద్ధతిలా పనిచేస్తుందని అడిలైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన మార్కెటింగ్ పరిశోధకుడు లాచ్‌లాన్ స్కోమ్‌బర్క్‌ని ఉటంకిస్తూ సైన్స్ అలర్ట్ నివేదిక పేర్కొంది.

వాస్తవానికి నగదును వినియోగించినప్పుడు ప్రజలు తిరిగి వచ్చే చిల్లర, నోట్లతో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారని, డిజిటల్ చెల్లింపుల్లో అది లేకపోవటం ఖర్చుల నియంత్రణలో విఫలమౌతున్నట్లు పేర్కొంది. దీనికి తోడు ప్రజలు స్టేటస్ సింబల్‌గా విలాసవంతమైన ఉత్పత్తులపై డబ్బు ఖర్చు చేయడం ప్రారంభించారు. ఇది గతంలో కూడా గమనించబడింది కానీ ఇంత స్థాయిలో ఎప్పుడూ లేదని నివేదిక వెల్లడించింది. ఇక టిప్స్ ఇస్తున్న విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు.
సానుకూల ఆర్థిక పరిస్థితులు, నగదు రహిత లావాదేవీల మధ్య లింక్ ఉంది. అయితే ఈ ధోరణి కాలక్రమేణా తగ్గుతోంది. అయితే ద్రవ్యోల్బణం స్థాయి నగదు లేదా నగదు రహిత వ్యయాన్ని ప్రభావితం చేయలేదు. నగదు రహిత లావాదేవీల వైపు మార్పు ప్రభావం కాలక్రమేణా బలహీనంగా మారిందని అధ్యయనం కనుగొంది. నగదు రహిత చెల్లింపు పద్ధతులు సర్వసాధారణంగా మారినందున, వినియోగదారులపై తక్కువ ప్రభావం చూపుతుందని సూచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నగదు రహిత లావాదేవీలకు మరింతగా అలవాటు పడ్డారని స్టడీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications