మందు బాబులకు గుడ్ న్యూస్. త్వరలోనే లిక్కర్ వారి ఇంటికే వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాయదారి కరోనా దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇండియా మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. దాదాపు రెండు నెలలు అన్ని రకాల సేవలు బంద్ అయిపోయాయి. అయితే, ఇటీవలే దేశంలో లిక్కర్ విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతులు మంజూరు చేసింది.
దీంతో 40 రోజులుగా తమాయించుకున్న మందు బాబులకు ప్రాణం లేచి వచ్చింది. మొన్నటికి మొన్న పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ వైన్ షాపులు ప్రారంభించగానే పొలోమని వందలు, వేల సంఖ్యలో మందు బాబులు షాపుల ముందు బార్లు తీరారు. ఎలాగైనా ఒక్క బాటిల్ అయినా సరే దక్కించుకొని, పొడిబారిన నాలుకను మత్తులో ముంచేయాలని ఎండను కూడా లెక్క చేయకుండా వైన్ షాపుల ముందు పడిగాపులు కాచారు.
ఈ విషయంలో అక్కడక్కడా మహిళలు కూడా లైన్లలో ఉండటం చూశాం. నిన్నటి నుంచి తెలంగాణ లోనూ వైన్ షాపులు తెరుచుకోవడంతో ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయింది. అయితే, త్వరలోనే వీరి బాధలు తీరేలా ఉన్నాయి.

జొమాటో రంగ ప్రవేశం...
కరోనా వైరస్ రంగ ప్రవేశం తర్వాత దేశంలో లిక్కర్ కు ఉన్న డిమాండ్ ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. దీంతో ఇప్పటికే దేశంలో ఫుడ్ డెలివరీ లో సంచలనం సృష్టించిన జొమాటో... త్వరలోనే లిక్కర్ డెలివరీ కూడా చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రముఖ రాయిటర్స్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఇప్పటికే గ్రోసరీ డెలివరీ సేవల్లోకి విస్తరిస్తున్న జొమాటో.. త్వరలోనే ఇండ్ల వద్దకు ఆల్కహాల్ ను కూడా డెలివరీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయటి ఫుడ్ తినేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. దీంతో ఫుడ్ డెలివరీ సేవలు బాగా దెబ్బతిన్నాయి. అలాగే, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ఫుడ్ డెలివరీ ఆప్ లపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో వైన్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమికూడుతున్న తరుణంలో ప్రజల ఇండ్ల వద్దకే లిక్కర్ అందిస్తే బెటర్ అనేది సరికొత్త ఆలోచన.

ఆన్‌లైన్‌లో లిక్కర్ కు నో...
ఇప్పటి వరకు దేశంలో ఆన్లైన్ విధానంలో లిక్కర్ ను డెలివరీ చేసే విధానం అమల్లో లేదు. అలాంటి సేవలపై నిషేధం కొనసాగుతోంది. అయితే దేశంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ సేవలే బెటర్ అనే అభిప్రాయానికి అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలు కూడా వస్తున్నాయి. నిజానికి దేశంలో మెడిసిన్ ఆన్లైన్ డెలివరీకి కూడా అనుమతులు లేవు.
వాటిపై నిషేధం కొనసాగుతోంది. కానీ.. ఈ రంగంలో చాలా కంపెనీలు సేవలు అందిస్తూనే ఉన్నాయి. అలాగే, ఇప్పుడు లిక్కర్ కూడా ఆన్లైన్ లో విక్రయించేందుకు ప్రభుత్వాలు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐ ఎస్ డబ్ల్యూ ఏ ఐ ) కూడా ఈ దిశగా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.

మాతో జత కట్టండి..
టెక్నాలజీ ఆధారిత హోమ్ డెలివరీ సేవలు ఆల్కహాల్ ను బాధ్యతాయుతంగా వినియోగించేందుకు తోడ్పడుతుందని జొమాటో సీఈఓ మోహిత్ గుప్త ఒక లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఐ ఎస్ డబ్ల్యూ ఏ ఐ కి తమ బిజినెస్ ప్రతిపాదన ముందు ఉంచుతూ ఒక లేఖ రాశారు. ఈ విషయాన్నీ రాయిటర్స్ వెల్లడించింది.
అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమ్రిత్ కిరణ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లిక్కర్ డెలివరీ కి రాష్ట్రాలు అనుమతించాలని కోరారు. నిరంతర ఆదాయం కోసం లిక్కర్ అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని అయన చెప్పారు. ఇదిలా ఉండగా.. దేశం లో లిక్కర్ బిజినెస్ చాలా చాలా పెద్దది. ఇది ఏకంగా 27.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ 2,04,000 కోట్లు) గా ఉంది. సో, మందు బాబులూ కాస్త ఓపిక పడితే.. మీ ఇంటికే బాటిల్ వచ్చే రోజులు మరెంతో దూరంలో లేవు!
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications