Go First: భారత గగనతంలో విమానాలు నడిపిన మరో సంస్థ తాజాగా కుప్పకూలింది. విమాన వ్యాపారాన్ని నడిపించేందుకు నగదు కొరత ఎదుర్కొంటున్న గో ఫస్ట్ ప్రస్థానం ముగియనుంది.
ఈ క్రమంలో స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద దరఖాస్తును దాఖలు చేసిందని కంపెనీ సీఈఓ కౌశిక్ ఖోనా తెలియజేశారు. ఇంధన చెల్లింపులకు తగినన్ని నిధులు లేకపోవటంతో విమానాలను మే 3, 4 తేదీల్లో నిలిపివేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్ తన అతిపెద్ద వార్షిక నష్టాన్ని నమోదు చేసింది.

సాధారణంగా విమానయాన సంస్థలకు అత్యంత పెద్ద వ్యయం ఇంధనం. వాడియా గ్రూప్ యాజమాన్యంలోని గోఫస్ట్ జెట్ ఇంధనాన్ని సరఫరా చేసే చమురు కంపెనీలకు బకాయి పడింది. దీనికి తోడు ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌లైన్స్, ఇండిగో సంస్థలు మార్కెట్లో పోటీని ఎదుర్కొనేందుకు కొత్త విమానాలను ఆర్డర్ చేయటంతో పాటు కొత్త గమ్యస్థానాలకు విమాన సేవలను అందిస్తూ వృద్ధికోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
ఎయిర్‌బస్ A320 నియో ఎయిర్‌క్రాఫ్ట్‌కు శక్తినిచ్చే ప్రాట్ & విట్నీ ఇంజిన్‌ల నుంచి ఇంజిన్‌లను డెలివరీ కాకపోవటంతో పాటు ఇతర సమస్యలతో విమానాల ఫ్లీట్ సగానికి పైగా తగ్గింది. దీంతో ఎయిర్‌లైన్ నగదు ప్రవాహం తీవ్రంగా దెబ్బతింది. కంపెనీ కుప్పకూలటంతో దీనిలో పనిచేసే దాదాపు 5000 మంది ఉద్యోగులు అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications