Pakistan: దాయాదికి చైనా లోన్ ఊరట.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏమన్నారంటే..
Pakistan: దేశాభివృద్ధి కంటే పక్క దేశాల నాశనంపైనే అత్యధిక వనరులను ఖర్చు చేసిన పాక్ చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడింది. ప్రస్తుతం ఆ దేశం ఆర్థిక అస్థవ్యస్థ పరిస్థితులను ఎదుర్కొంటోంది.
నగదు కొరతతో అప్పులు చెల్లించేందుకు కూడా సరిపడా డబ్బు లేని పాకిస్థాన్ సాయం కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాయాది తన చిరకాల మిత్రదేశమైన చైనా నుంచి 600 మిలియన్ డాలర్ల అదనపు రుణాన్ని అందుకోనుంది. దీంతో పాక్ ఆర్థిక వ్యవస్థ మరింత ఊపందుకుందని మంగళవారం డాన్ పత్రిక నివేదించింది.

IMF నుంచి 3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ కారణంగా ఇప్పటికే ఊపందుకుంది. విదేశీ మారక నిల్వలను పెంచడం ఈ రుణం లక్ష్యం అని పాకిస్థాన్ ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం పాక్ చైనా నుంచి అందుకున్న రుణం గత మూడు నెలల్లో చైనా చేసిన అతిపెద్ద ఆర్థిక సహాయంగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మెుత్తంగా బీజింగ్ 5 బిలియన్ డాలర్లకు పైగా రుణాన్ని అందించింది. IMF బెయిలౌట్ కోసం చర్చలు కొనసాగుతున్నందున అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశం డిఫాల్ట్‌ను నివారించడంలో చైనా రుణాలు సహాయపడ్డాయి. ఆ తర్వాత జూన్ 30న IMF నుంచి 3 బిలియన్ డాలర్ల బెయిలౌట్‌ను పొందింది.
గతవారం పాక్ మరో మిత్రదేశమైన సౌదీ నుంచి 2 బిలియన్ డాలర్ల డిపాజిట్ కూడా పొందింది. పాకిస్థాన్‌కు ఈ ఆర్థిక సహాయాన్ని అందించినందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ & ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ మహమ్మద్ బిన్ సల్మాన్‌కు షరీఫ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో అప్పులపై ఆధారపడకుండా ఆదాయాన్ని సంపాదించే మార్గాలపై ప్రధాని ఫోకస్ పెట్టారు.


Click it and Unblock the Notifications