Go First: మే నెల ప్రారంభానికి ముందు వరకు గో ఫస్ట్ విమానయాన సంస్థ తన సేవలను విజయవంతంగా కొనసాగించింది. అయితే ఈ క్రమంలో కంపెనీ ఏప్రిల్ 30 వరకు అన్ని చెల్లింపులను పూర్తి చేసింది. కానీ అకస్మాత్తుగా డబ్బు కొరతతో విమానాలను నడపలేమంటూ దివాలాకు దాఖలు చేసింది.
కంపెనీకి ఉన్న మెుత్తం 54 విమానాల్లో 28 గ్రౌండెడ్ కాగా కేవలం 26 మాత్రమే సేవలను అందిస్తున్నాయి. అయితే కంపెనీ స్వచ్చంద దివాలాకు వెళ్లటంతో లీజర్లు చర్యలు ప్రారంభించారు. లీజు అగ్రమెంట్లను టర్మినేట్ చేయటంతో పాటు ఖాతాలను స్తంభింపజేస్తున్నారు. కంపెనీని తిరిగి కాపాడేందుకు అవకాశం ఉన్నందున మధ్యంతర తాత్కాలిక మారటోరియంను గో ఫస్ట్ కోరుతోంది.

ఈ క్రమంలో కంపెనీ NCLTలో మెుదటి విచారణకు వెళ్లింది. కంపెనీ ఏప్రిల్ నెలలో రూ.293 కోట్లను పంప్ చేసింది. ఈరోజు మధ్యంతర మారటోరియం విధించకపోతే విమానాలు సీజ్ చేయబడతాయని, లీజులు రద్దు చేయబడి, ఖాతాలు స్తంభిస్తాయని గో ఫస్ట్ కోర్టుకు వెల్లడించింది. గో ఫస్ట్ కుప్పకూలితే గుత్తాధిపత్యానికి కారణమౌతుందని కంపెనీ కోర్టుకు తెలిపింది.
ప్రస్తుతం గో ఫస్ట్‌కి ఇంధనం, జీతాలు, ఎయిర్‌పోర్ట్ ఖర్చులు మొదలైన వాటికి చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సింగపూర్ నుంచి ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయాలని తాము ఆశిస్తున్నట్లు కంపెనీ కోర్టుకు తెలిపింది. డిసెంబరు వరకు ప్రతి నెలా 10 సర్వీస్‌డ్ ఇంజిన్‌లను సరఫరా చేయాలని SIAC ఆర్బిట్రేషన్ ప్రాట్ & విట్నీని ఆదేశించింది. ఈ క్రమంలో కంపెనీని పునరుద్ధరించేందుకు కంపెనీ అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది.

కంపెనీలోని అనుభవజ్ఞులు కంపెనీని నడపలేని పరిస్థితుల్లో దివాలా నిపుణులు ఎలా నడపగలని కోర్టు గో ఫస్ట్ ను ప్రశ్నించింది. దీనికి ముందు నిన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన బ్యాంక్ గ్యారెంటీని రద్దు చేసింది. దేశీయ విమానయానంలో 8 శాతం వాటా కలిగి ఉన్న సంస్థ ఆర్థిక ఇబ్బందులతో కోర్టు మెట్లు ఎక్కటం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి కంపెనీ తరువాతి రూటేంటనేదానిపై గందరగోళం కొనసాగుతోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications