Adani News: ఆకలితో ఉన్న అదానీ గ్రూప్.. తాజాగా వేలకోట్లు పెట్టుబడులు.. పూర్తి వివరాలు
Adani News: అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన తీవ్రమైన ఆరోపణల నుంచి ఇటీవలే గౌతమ్ అదానీ గ్రూప్ తేరుకుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించేందుకు గౌతమ్ అదానీ అనేక అప్పులను గడువు కంటే చాలా ముందరే చెల్లించారు.
అయితే ఇప్పుడున్న సవాలు ఏంటంటే తన వ్యాపారాల మూలధన అవసరాల కోసం గౌతమ్ అదానీ ఇప్పుడు పెట్టుబడిదారులను, రుణదాతలను ఎలా ఆకర్షిస్తారనేది వేచిచూడాల్సిన అంశంగా ఉంది. ఈ క్రమంలో అదానీ సామ్రాజ్యంలోని పవర్ బిజినెస్ నిధుల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. మరోపక్క 2024 ప్రారంభంలో జాతీయ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన మోడీకి, తన దేశ నిర్మాణ ఎజెండాలో మౌలిక సదుపాయాలను ప్రధాన అంశంగా ఉన్నందున ఇది కీలకమైన అంశం కూడా.

ఇదే సమయంలో తంతే బూరెల బుట్టలో పడ్డట్లు విదేశీ పెట్టుబడులు అదానీ గ్రూప్ కంపెనీల్లోకి వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ ఆరోపణల సమయంలో అమెరికాకు చెందిన GQG పార్టనర్స్ అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అలా మార్చిలో నెలలో రాజీవ్ జైన్-నియంత్రిత GQG భాగస్వాములు ప్రారంభంలో నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల్లో మెుత్తం రూ.15,446 కోట్లు ($1.87 బిలియన్లు) పెట్టుబడి పెట్టారు. అయితే ఈ సంస్థ మరోసారి అదానీ కంపెనీల్లో దాదాపు 500 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
హిండెన్ బర్గ్ దెబ్బ తర్వాత అదానీ గ్రూప్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఫలవంతంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగటంతో అదానీ స్టాక్స్ స్థిరమైన రికవరీని నమోదు చేశాయి. దీంతో అమెరికా ఆధారిత GQG పెట్టుబడి విలువ ఇప్పటికే 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని వెల్లడైంది. దీని ప్రకారం చూస్తుంటే పెట్టుబడి సంస్థ దాదాపు 58 శాతం రాబడిని పొందినట్లు తెలుస్తోంది. అలాగే ఐదేళ్ల కాలంలో అదానీ కంపెనీల్లో అతిపెద్ద పెట్టుబడిదారుల్లో ఒకరిగా ఉండాలని భావిస్తున్నట్లు జైన్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications