యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పేమెంట్స్ చాలా సింపుల్ గా చేస్తున్నాం. యూపీఐ గత కొన్ని సంవత్సరాలుగా మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారింది. చిన్న కిరణా షాపు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు అన్నింటిలో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం. యూపీఏ కేవలం డబ్బులు చెల్లించడానకి ఉపయోగపడేది.
ఆ తర్వాత ఏటీఎంల్లో యూపీఐ ఉపయోగించి డబ్బులు కూడా తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తాజాగా యూపీఐతో ఐటీఎంలో డిపాజిట్ కూడా చేయవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పుడు ఏటీఎంలలో యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ సౌకర్యాన్ని త్వరలో ప్రారంభించనుంది. యూపీఐ యాప్ ద్వారా కస్టమర్‌లు త్వరలో బ్యాంకులు, ఏటీలో ఏటీఎంల వద్ద నగదు డిపాజిట్ మెషీన్‌ల (CDMలు) వద్ద నగదును డిపాజిట్ చేయవచ్చని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

"క్యాష్ డిపాజిట్ మెషీన్‌ల (సిడిఎంలు) ద్వారా నగదును డిపాజిట్ చేయడం ప్రధానంగా డెబిట్ కార్డ్‌ల వాడకం ద్వారా జరుగుతుంది. కార్డ్‌లెస్ క్యాష్ నుంచి పొందిన అనుభవం దృష్ట్యా ఏటీఎంలలో యూపీఐని ఉపయోగించి ఉపసంహరణ, ఇప్పుడు యూపీఐని ఉపయోగించి సీడీఎంలలో నగదు జమ చేసేందుకు ప్రతిపాదించాం" అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
బ్యాంకులచే అమలు చేసే నగదు డిపాజిట్ మెషీన్‌లు (CDMలు) బ్యాంకు శాఖలపై నగదు-నిర్వహణ భారాన్ని తగ్గిస్తాయన్నారు. నగదు డిపాజిట్ సౌకర్యం ప్రస్తుతం డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా మాత్రమే అందుబాటులో ఉందన్నారు. యూపీఐ ప్రజాదరణ పొందినందున ఏటీఎంలలో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. యూపీఐని ఉపయోగించడం ద్వారా నగదు డిపాజిట్ సౌకర్యాన్ని సులభతరం చేయడానికి ప్రతిపాదించినట్లు వివరించారు.


Click it and Unblock the Notifications