కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దేశాన్ని మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులను మోసం చేసిన ఆర్థిక నేరగాళ్ల నుండి డబ్బును తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం చురుకుగా కేసులను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్టి) యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) యొక్క 5,800 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చెప్పిన వెంటనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై , డైమండ్స్ వ్యాపారి నీరవ్ మోదీ , ఆయన బంధువు మెహుల్ చోక్సీ లపై బ్యాంక్ మోసం కేసు దర్యాప్తు జరుగుతోందని, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, త్వరితగతిన భారత్ కు తీసుకొస్తామని, వారి ఆస్తులు జప్తు చేసి, వారి చెల్లించాల్సిన బకాయిలను తిరిగి పొందుతామని ఫైనాన్స్ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టంచేశారు. దేశంలోనే అతిపెద్ద వైట్ కాలర్ నేరగాళ్ల గా ముద్రపడిన ఆర్థిక నేరస్తులు విజయ్ మాల్యా , నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ తమ సంస్థల ద్వారా బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేశారని పేర్కొన్నారు.

దీనివల్ల రుణదాతలైన బ్యాంకులకు మొత్తం రూ .22,585.83 కోట్ల నష్టం వాటిల్లిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఇక మొత్తాన్ని అణా పైసలతో సహా వసూలు చేస్తామని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు బ్యాంకులకు కొంత బూస్ట్ ఇచ్చినట్లయింది. ఇలాంటి ఆర్ధిక నేరగాళ్లకు ఈడీ తాజా చర్యలు, వీరి విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వారిలో భయాన్ని కలిగిస్తుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications