కరారో ఇండియా ఐపిఒ ఓపెనింగ్: ఇన్వెస్టర్లు చూపు దీనిపైనే.. ప్రైస్ బ్యాండ్ ఫిక్స్..
ప్రైమరీ మార్కెట్‌లో రానున్న కొద్ది రోజుల్లో సందడి కొనసాగనుంది. నేడు కరారో ఇండియా IPO ప్రారంభమైంది. కంపెనీ ఐపీఓ సైజ్ రూ.1250 కోట్లు. ఈ IPO పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ఆధారంగా ఉంటుంది. ఐపీఓ ద్వారా కంపెనీ 1.78 కోట్ల షేర్లను జారీ చేయనుంది. ఈ IPO డిసెంబర్ 20న అంటే ఇవాళ మొదలైంది. కంపెనీ IPO డిసెంబర్ 24 వరకు తెరిచి ఉంటుంది. ఇంకా కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ని కూడా ప్రకటించింది.
ప్రైస్ బ్యాండ్ అంటే ఏమిటి?
కరారో ఇండియా IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.668 నుండి రూ.704గా నిర్ణయించింది. కంపెనీ ఒక లాట్ 21 షేర్లను చేసింది. దీని కారణంగా ఏదైనా రిటైల్ పెట్టుబడిదారుడు కనీసం రూ. 14,784 బెట్ వేయాలి. ఇది ప్రైమరీ బోర్డు IPO. దీని కారణంగా కంపెనీ లిస్టింగ్ BSE అండ్ NSEలో ప్రతిపాదించింది. IPOలో గరిష్టంగా 50 శాతం అర్హత ఉన్న సంస్థాగత కొనుగోలుదారుల కోసం రిజర్వ్ చేసారు. అలాగే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కనీసం 35 శాతం షేర్ రిజర్వ్ చేయగా ఇంకా నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఈ IPOలో కనీసం 15 శాతం వాటా పొందుతారు.

కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఉంటే ?
గత కొన్నేళ్లుగా కరారో ఇండియా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 4.44 శాతం పెరిగి రూ.1770.45 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 1695.12 కోట్లుగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, BNP పారిబాస్ అండ్ నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌లు కారరో ఇండియా IPO కోసం లీడ్ మేనేజర్‌లుగా నియమితులయ్యారు. కాగా, లింక్ ఇన్‌టైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రిజిస్ట్రార్‌గా నియమించారు. అయితే పబ్లిక్ మార్కెట్ నుండి రూ. 1,200 కోట్లను సమీకరించడానికి కారరో ఇండియా ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ఇవాళ ప్రారంభించనుంది.
ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ (PAT) 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 48.46 కోట్ల నుండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 62.56 కోట్లకు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మధ్య కరారో ఇండియా ఆదాయం 4 శాతం పెరిగగా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ (PAT) 29 శాతం పెరిగింది. FY 2024-25 మొదటి రెండు త్రైమాసికాలలో సంస్థ ఆదాయం రూ.922.74 కోట్లు, PAT 49.73 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications