Adani Ports: అదానీ పోర్ట్స్ సరికొత్త రికార్డ్.. ప్రైవేటు పోర్టు సరికొత్త రేటింగ్ రికార్డ్..
Adani Ports & SEZ: అదానీ గ్రూప్ కంపెనీల్లో లాభదాయకమైన ప్రముఖ లిస్టెడ్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కూడా ఒకటి. గౌతమ్ అదానీ నేతృత్వంలో పోర్టు వ్యాపారం వేగంగా వృద్ధిని సాధిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.
తాజాగా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ రేటింగ్ సంస్థ కేర్ నుంచి AAA రేటింగ్ పొందిన మెుట్టమెుదటి ప్రైవేటు పోర్టు ఆపరేటర్‌గా రికార్డు సృష్టించింది. గతంలో ఉన్న రేటింగ్ అప్ గ్రేడ్ చేయటంతో కంపెనీ విలువ అమాంతం పెరిగింది. రేపు మార్కెట్ల ఓపెనింగ్ తర్వాత ఇన్వెస్టర్లు అదానీ పోర్ట్స్ షేర్లపై పెద్ద బెట్టింగ్ వేసే దిశగా ఇది ప్రేరేపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఇది భారతదేశంలో ఏదైనా కంపెనీకి అందించగలిగిన అత్యధిక క్రెడిట్ రేటింగ్. ఇది కంపెనీ బలమైన క్రెడిట్ యోగ్యతతో పాటు పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించగలిన సామర్థ్యాన్ని సూచిస్తుంది.

ఈ విజయం భారతదేశంలోని ప్రైవేట్ మౌలిక సదుపాయాల రంగానికి కూడా ప్రధాన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ గుర్తింపును పొందిన మొదటి, ఏకైక ప్రైవేట్ మౌలిక సదుపాయాల డెవలపర్‌గా అదానీ పోర్ట్స్ సంచలన రికార్డును నమోదు చేసింది. రేటింగ్స్ అప్‌గ్రేడ్ అదానీ పోర్ట్స్ బలమైన వ్యాపార నమూనా, ఆరోగ్యకరమైన లాభదాయకతతో కార్యకలాపాల్లో బలమైన వృద్ధి, అధిక లిక్విడిటీ, తక్కువ పరపతి కారణంగా నిలిచాయి. అలాగే కంపెనీ తన బాండ్ల బైబ్యాక్ కార్యచరణ కూడా సానుకూల అంశంగా ఉంది.
కంపెనీ 2011లో కేవలం ముంద్ర, ధహేజా పోర్టులను కలిగి ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం దేశ తీరప్రాంతంలో మెుత్తంగా 14 పోర్టులను ఆపరేట్ చేస్తోంది. మెరుగైన రీచ్, వ్యూహాత్మక పోర్ట్ స్థానాలు, కార్యాచరణ సామర్థ్యాలు, లాజిస్టిక్స్‌తో సహా సమగ్ర సేవలను అందించటం అద్భుతమైన వృద్ధికి దోహదపడింది.
ప్రస్తుతం అదానీ పోర్ట్స్ దేశంలో పోర్టు వ్యాపారంలో మెుత్తంగా 27 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే పెరిగిన వాల్యూమ్ హ్యాండిలింగ్ కారణంగా లాభదాయకత పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే కంపెనీ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండగా నేడు మార్కెట్లు క్లోజింగ్ సమయంలో అదానీ పోర్ట్స్ స్టాక్ ఎన్ఎస్ఈలో రూ.1,322.90గా ఉంది.


Click it and Unblock the Notifications