కారు కొనాలనుకునే వారికి షాకింగ్ వార్త.. Maruti Suzuki కీలక ప్రకటన..!
Price Hike: కొత్త ఏడాది అన్నింటా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ సైతం తన కార్ల రేట్లను పెంచాలని నిర్ణయించుకుంది. అయితే రానున్న కాలంలో ఇదే దారిలో మరిన్ని కంపెనీలు నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తాను విక్రయిస్తున్న కారు మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదలకు ద్రవ్యోల్బణతో పాటు, వాహన రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెగ్యులేటరీ అవసరాలు కారణమని కంపెనీ పేర్కొంది. వీటి వల్ల తయారీలో వ్యయాలు పెరిగాయని.. ఆ ప్రభావం మార్జిన్లపై ఒత్తిడిని చూస్తుందని వెల్లడించింది.

ధరల పెంపు ఏప్రిల్ 2023 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. అయితే ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉంటుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ మోడళ్లను బట్టి ధరల పెంపులో మార్పులు ఉండవచ్చని ఆటో సెక్టార్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ ఖర్చును తగ్గించుకోవటానికి.. పాక్షికంగా పెరుగుదలను భర్తీ చేయడానికి గరిష్ఠ ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది.
కంపెనీ వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు చేసిన ప్రకటనపై మార్కెట్ వర్గాలు సానుకూలంగా స్పందించాయి. ఈ క్రమంలో మారుతీ సుజుకీ షేర్లు ఇంట్రాడేలో దాదాపు 2 శాతం వరకు పెరిగాయి. ధరల పెంపు వాణిజ్య వాహనాలపై లేదా ప్యాసింజర్ వాహనాలపై.. ప్రభావం చూపుతుందా..? లేదో..? అనే వివరాలను మారుతి సుజుకి వెల్లడించలేదు. ఈ ధరల పెంపు వల్ల రెండు సెగ్మెంట్లలోని కార్లపై ప్రభావం పడుతుందని ఆటో వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications