KIA India: దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన కియా ఇండియా తమ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది.కియా సెల్టోస్, సొనాటా, కారెన్స్ ధరలు ఏప్రిల్ 1, 2024 నుంచి పెరుగుతాయని స్పష్టం చేసింది.
కియా ఇండియా వివిధ మోడళ్ల కార్ల ధరలను గతం కంటే 3 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. సరఫరా గొలుసులో పెరిగిన వస్తువుల ధర కారణంగా కియా తాజా ధరల పెంపును అమలు చేస్తోంది. ఇది ఈ ఏడాది కంపెనీ ప్రకటించిన మొదటి ధరల పెంపు నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ద్రవ్యోల్బణం కారణంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక రాజకీయ పరిస్థితులు పరోక్షంగా ధరల పెరుగుదలను ప్రేరేపించాయని ఆటో నిపుణులు చెబుతున్నారు.

దీనిపై వ్యాఖ్యానిస్తూ కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ కియా తమ విలువైన కస్టమర్లకు ప్రీమియం, సాంకేతికంగా అధునాతన ఉత్పత్తులను అందించడానికి నిరంతరం తాము కృషి చేస్తున్నామన్నారు. పెరుగుతున్న ఇన్‌పుట్ ధర కారణంగా మేము ధరల పెంపును అమలు చేయవలసి వస్తుందని అన్నారు. ధరల పెరుగుదలలో అధిక భాగాన్ని కియా గ్రహిస్తుందని తద్వారా వినియోగదారులపై ఎక్కువ ఖర్చు భారం పడకుండా చూస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల వినియోగదారులు తమకు ఇష్టమైన కియా కార్లను కొనుగోలు చేయటం కొనసాగించవచ్చని అన్నారు.
కియా ఇండియన్ అండ్ గ్లోబల్ మార్కెట్లలో గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. ఇది ఇప్పటి వరకు దాదాపు 1.16 మిలియన్ యూనిట్లను విక్రయించింది. దాని లైనప్‌లో సెల్టోస్ 6,13,000 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత 3,95,000 యూనిట్లతో సొనెట్‌లు, దాదాపు 159,000 యూనిట్లతో కేరన్‌లు ఉన్నాయి. మునుపటి నెలలో కియా ఇండియా 20,200 యూనిట్లను విక్రయించింది. ఇందులో అత్యధికంగా సోనెట్ 9,102 యూనిట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications