Volkswagen Offer: తంతే ఎగిరి బూరెల బుట్టలో పడటం అంటే ఇదేనేమో. అవునండి బాబు కారు కొంటే ఇన్ని ఆఫర్లు ఒకేసారి రావటం చాలా అరుదు. మీరు కారు కొనే ఆలోచనలో ఉన్నట్లయితే.. సూపర్ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే..
ప్రఖ్యాత జర్మన్ కార్ మేకర్ ఫోక్స్ వ్యాగన్ తన కార్లపై కస్టమర్లకు కళ్లు చెదిరే తగ్గింపులను ప్రకటించింది. అవును కంపెనీకి చెందిన తైగూర్ మోడల్ కారు కొనాలనుకునేవారికి ఏకంగా రూ.1.60 లక్షల తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. పైగా ఈ కారుకు ఫైస్టార్ రేటింగ్ కూడా ఉంది. అంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ కార్ డీల్ అన్నమాట.

పైగా ఎవరైనా కస్టమర్ ఈ కారును ఆగస్టు 10- సెప్టెంబర్ 5 మధ్య కాలంలో కొనుగోలు చేసినట్లయితే వారు శ్రీలంకలో జరిగే ఆసియా కప్ ఫైనల్స్ మ్యాచ్ ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. కంపెనీ అందిస్తున్న మెుత్తం తగ్గింపులో లక్ష రూపాయలు నేరుగా క్యాష్ డిస్కౌంట్ ఉండగా.. మరో రూ.60 వేలను లాయల్టీ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజీ బోనస్ రూపంలో అందిస్తోంది. ఇదే క్రమంలో ఫోక్స్ వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చని స్పష్టం చేసింది.
వర్చుస్ కారు కొనుగోలుదారులకు రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉండగా.. మిగిలిన మెుత్తాన్ని ఎక్స్ఛేంజీ బోనస్ రూపంలో అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు కొనేవారికి సైతం శ్రీలంక వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం కారుతో పాటు టూరు ఫ్రీగా పొందే అవకాశం అదికూడా భారీ తగ్గింపుల్లో రావటం పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. వాహన ప్రియులు దీనిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని డీలర్ ను సంప్రదించటం ఉత్తమం.


Click it and Unblock the Notifications