Multibagger Stock: బ్రాండెడ్ బట్టలకు ఈ రోజుల్లో డిమాండ్ ఎలా ఉందో మనకు తెలుసు. మనలో చాలా మంది మెుదటి ఛాయిస్ వాటికే ఇస్తుంటాం. అయితే ఈ బట్టల తయారీ కంపెనీ మాత్రం తన ఇన్వెస్టర్లకు కాసుల పంట పడిస్తోంది. రెండేళ్ల కాలంలోనే మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.

గార్మెంట్ కంపెనీ కనక వర్షం..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కాంటాబిల్ రిటైల్ ఇండియా లిమిటెడ్ స్టాక్ గురించే. ఈ కంపెనీ "CANTABIL", "LA FANSO" బ్రాండ్ పేర్లతో దుస్తులు డిజైన్, తయారీ, బ్రాండింగ్, రిటైలింగ్ వ్యాపారంలో ఉంది.

దేశవ్యాప్తంగా వ్యాపారం..
కంపెనీకి దేశవ్యాప్తంగా 390కి పైగా ప్రత్యేకమైన రిటైల్ అవుట్‌లెట్ల నెట్‌వర్క్ ఉంది. దేశం అంతటా కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2700 కంటే ఎక్కువగా ఉంది. CANTABIL బ్రాండ్ మధ్యతరగతి నుంచి అధిక ఆదాయ వర్గానికి చెందిన పురుషులు, మహిళల కోసం పూర్తి స్థాయి ఫార్మల్ వేర్, పార్టీ వేర్, క్యాజువల్, అల్ట్రా క్యాజువల్ కేటగిరీల్లో దుస్తులను అందిస్తోంది.

రెండేళ్లలో 260% రిటర్న్..
స్మాల్ క్యాప్ క్యాటగిరీకి చెందిన అప్పెరల్ కంపెనీ గత రెండేళ్లలో తన పెట్టుబడిదారులకు 2.6 రెట్లు రాబడిని అందించింది. కంపెనీ షేర్ ధర ఆగస్టు 4, 2020న రూ.314.40గా ఉంది. అయితే ఈ స్టాక్ ఈ రోజు మార్కెట్లో మధ్యాహ్నం 12.40 గంటలకు రూ.1,120 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ క్రమంలో దాదాపు 250 శాతానికి పైగా రాబడిని అందించింది.

పెట్టుబడిపై రాబడి ఇలా..
కాంటాబిల్ రిటైల్ ఇండియా లిమిటెడ్ షేర్లలో రెండేళ్ల కిందట రూ.లక్ష పెట్టుబడిపెట్టిన ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.3.56 లక్షలుగా మారింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,299 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.346.30గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications