క్యాండిడ్ న్యూస్ ... రుచిని ఆస్వాదిస్తూ క్యాండీలు తినే ఉద్యోగాలు .. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 15

తియ్యటి రుచిని ఆస్వాదించడానికి ఉద్యోగం ఇస్తే ఎవరు కాదంటారు చెప్పండి. నిజంగా అలాంటి స్వీట్ న్యూస్ అందించింది ఓ క్యాండీ కంపెనీ. కెనడాకు చెందిన ఓ క్యాండీ తయారీ కంపెనీ తమ క్యాండీలను రుచి చూసి సమీక్ష ఇవ్వడం కోసం ఉద్యోగులు కావాలంటూ ప్రకటన విడుదల చేసింది. ఇక ఉద్యోగానికి కావాల్సిన అర్హతల విషయానికి వస్తే క్యాండీలు తినడం వాటి రుచిని ఆస్వాదించి వాటికి సమీక్షలను ఇవ్వగలగటమే అర్హత.

క్యాండీ ఫన్‌హౌస్ అందిస్తున్న అద్భుతమైన ఉద్యోగాలు

క్యాండీ ఫన్‌హౌస్ అందిస్తున్న అద్భుతమైన ఉద్యోగాలు

రుచిని చక్కగా గుర్తించి సరైన సమీక్ష చేసి బ్రహ్మాండమైన శాలరీని పొందే అద్భుతమైన అవకాశం ఇస్తుంది క్యాండీ ఫన్‌హౌస్‌. అంటారియో లోని మిస్సిసాగ లో ఉన్న క్యాండీ తయారీ కంపెనీ కాండీ ఫన్‌హౌస్ ప్రస్తుతం మూడు వేల రకాల క్యాండీలను తయారు చేస్తోంది . బ్రాండెడ్ క్యాండీ లైన్‌లో ఏ క్యాండీలు భాగమవుతాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సంస్థ పార్ట్‌టైమ్ మరియు ఫుల్ టైం "క్యాండియాలజిస్టులు", ఎకెఎ క్యాండీ మరియు చాక్లెట్ టేస్ట్ టెస్టర్లను తీసుకుంటోంది.

 క్యాండీలను టేస్ట్ చేసే ఉద్యోగం .. తిని రివ్యూ ఇస్తే జీతం

క్యాండీలను టేస్ట్ చేసే ఉద్యోగం .. తిని రివ్యూ ఇస్తే జీతం

ఈ లైన్ లో ఉద్యోగులు సూపర్ టేస్ట్ క్యాండీ లను 10 క్యాండీలను ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఉద్యోగం కావాలంటే, మీకు క్యాండీ ఉత్పత్తులను ప్రయత్నించడానికి ఉత్సాహం మరియు ఆత్రుత ఉండాలి . రుచి, ఆకృతి మరియు నాణ్యత యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోవాలి . అప్పుడు మీరు పరీక్షించిన ప్రతి క్యాండీకి సంక్షిప్త, రెండు వాక్యాల వివరణ రాయాలి. సాధారణంగా, మీరు నిజంగా క్యాండీ లను ఇష్టపడాలి మరియు దాని రుచి గురించి వివరించడానికి సిద్ధంగా ఉండాలి. అలా ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనే కంపెనీ తన వెబ్ సైట్ లో ఒక ప్రకటనలో పేర్కొంది.

తినే ఉద్యోగానికి ఫుల్ టైం అయితే గంటకు 30 డాలర్ల వేతనం , పార్ట్ టైంకు గంటకు 26 డాలర్లు వేతనం

తినే ఉద్యోగానికి ఫుల్ టైం అయితే గంటకు 30 డాలర్ల వేతనం , పార్ట్ టైంకు గంటకు 26 డాలర్లు వేతనం

క్యాండీ లను చూసి సమీక్ష ఇచ్చే ఉద్యోగులకు గంటకు 30 డాలర్ల ను చెల్లిస్తుంది . పార్ట్ టైమ్ ఉద్యోగానికి అయితే వారానికి 15 గంటలు ఇచ్చే అవకాశం ఉంది . పార్ట్ టైం జాబ్ అయితే ఇంటి నుండి చేయవచ్చు మరియు గంటకు 26 డాలర్లను చెల్లించనున్నట్టు సంస్థ తెలిపింది . ఇద్దరు వ్యక్తులకు ఫుల్ టైం ఉద్యోగులుగా ఉండటానికి అవకాశం కల్పిస్తుంది కంపెనీ. పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా ఎనిమిది మందిని తీసుకునే ఆలోచనలో ఉంది సంస్థ.

 యూఎస్, కెనడా వాసులకు మాత్రమే బంపర్ ఛాన్స్ ..

యూఎస్, కెనడా వాసులకు మాత్రమే బంపర్ ఛాన్స్ ..

ఇక ఈ తినే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 15, 2021 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తుదారులు హైస్కూల్ డిప్లొమా కలిగి ఉండాలి మరియు దరఖాస్తు చేసుకోవడానికి యు.ఎస్ లేదా కెనడా పౌరులుగా ఉండాలి అని ట్విస్ట్ ఇచ్చింది. ఏదేమైనా యూఎస్, కెనడా వాసులకు ఈ క్యాండీలు తినే ఉద్యోగం నిజంగా ఓ స్వీట్ న్యూస్. ఈ ఉద్యోగం దక్కించుకోగలిగిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+