Canara Bank Q3 Results: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల జాతర కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు ప్రస్తుతం కంపెనీలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వ రంగ రుణదాత కెనరా బ్యాంక్ నేడు 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.3,656 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతంలో రుణదాత నికర లాభంలో రూ.2,881.52 కోట్లతో పోలిస్తే 26.87 శాతం పెరిగుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 5.89 శాతంతో పోలిస్తే బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 4.39 శాతానికి తగ్గాయి. త్రైమాసికంలో నికర ఎన్పీఏ 1.32 శాతంగా ఉంది.

మార్కెట్లు ముగిసే సమయంలో కెనరా బ్యాంక్ షేర్లు ఎన్ఎస్ఈలో రూ.455.10 వద్ద ముగిసింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 9.50 శాతం వృద్ధితో రూ.9,417 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 9 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 3.02 శాతానికి చేరుకుంది. గ్లోబల్ డిపాజిట్లు రూ.12,62,930 కోట్లుగా ఉండగా.. అడ్వాన్స్‌లు రూ.9,50,430 కోట్లతో ప్రభుత్వ రంగ రుణదాత ప్రపంచ వ్యాపారం డిసెంబర్ 2023 నాటికి 9.87 శాతం పెరిగి రూ.22,13,360 కోట్లకు చేరుకుంది.
కెనరా బ్యాంక్ రిటైల్ లెండింగ్ పోర్ట్‌ఫోలియో ఏడాది ప్రాతిపదికన 12.14 శాతం వృద్ధితో రూ.1,53,640 కోట్లకు పెరిగింది. హౌసింగ్ లోన్ పోర్ట్‌ఫోలియో 12.07 శాతం పెరిగి రూ.91,800 కోట్లుగా నిలిచింది. డిసెంబర్ 2023 నాటికి వ్యవసాయం & అనుబంధ కార్యకలాపాలకు అడ్వాన్స్‌లు 19.26 శాతం పెరిగి రూ.2,42,470 కోట్లకు చేరుకున్నాయి. జనవరి 1 నాటికి బ్యాంక్ దేశవ్యాప్తంగా 9585 శాఖలను కలిగి ఉంది. అలాగే 10463 ఏటీఎంలను కలిగి ఉంది. అలాగే బ్యాంక్ లండన్, న్యూయార్క్ & దుబాయ్‌లలో 3 విదేశీ శాఖలను కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications