Canara Bank Q2 Results: రెండవ త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థలు మంచి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో లాభాల తగ్గుదల ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ FY25 రెండవ త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 11 శాతం పెరిగింది. రెండవ త్రైమాసికంలో కంపెనీ రూ.4,015 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. నేడు మార్కెట్ల ముగింపు నాటికి స్వల్ప లాభపడి ఎన్ఎస్ఈలో రూ.103.52 వద్ద క్లోజ్ అయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.93,950 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కెనరా బ్యాంక్ మొత్తం ఆదాయం 10% పెరిగి రూ.34,721 కోట్లకు చేరుకుంది.

సెప్టెంబర్ త్రైమాసికంలో కెనరా బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. బ్యాంక్ స్థూలనిరర్ధక ఆస్తి నిష్పత్తి సెప్టెంబర్ 2024 త్రైమాసికంలో ఒక త్రైమాసికం క్రితం 4.14 శాతం నుంచి 3.73 శాతానికి క్షీణించింది. ఇది ఆస్తి నాణ్యతలో మెరుగుదలని ప్రతిబింబిస్తోంది. ఈ త్రైమాసికంలో నికర ఎన్‌పీఏ నిష్పత్తి ఏడాది ప్రాతిపదికన 24 బేసిస్ పాయింట్లు తగ్గి 1 శాతానికి పరిమితమైందని కంపెనీ వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రొవిజన్ కవరేజ్ రేషియో 90.89 శాతం ఉండగా.. జూన్ 2024 నాటికి ఇది 89.22 శాతంగా ఉంది. అలాగే సెప్టెంబర్ 2024 నాటికి గ్లోబల్ బిజినెస్ 9.42% వార్షికంగా వృద్ధి చెంది రూ.2.36 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ సమయంలో గ్లోబల్ డిపాజిట్లు రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి.
సెప్టెంబరు 2024 నాటికి బ్యాంకు దేశీయ డిపాజిట్లు 8.34% వార్షిక వృద్ధితో రూ.1.24 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా. సెప్టెంబర్ 2024 వరకు బ్యాంక్ దేశీయ అడ్వాన్సులు 8.64% వార్షిక వృద్ధితో రూ.9.54 లక్షల కోట్లుగా ఉన్నాయి. రెండవ త్రైమాసికం చివరి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకు మొత్తం 9,658 శాఖలు ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో 3,115 గ్రామీణ శాఖలు, 2,778 సెమీ-అర్బన్ శాఖలు, 1,918 పట్టణ శాఖలు, 1,847 మెట్రో శాఖలు ఉండగా.. 9,881 ATMలు ఉన్నాయి. దీనికి తోడు బ్యాంక్ లండన్, న్యూయార్క్, దుబాయ్, IBU గిఫ్ట్ సిటీలలో నాలుగు విదేశీ శాఖలను కూడా నిర్వహిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications