కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డెబిట్ కార్డులు, ATM కార్డులను ఉపయోగించే ఖాతాదారులకు బ్యాంక్ గొప్ప ఉపశమనం ఇచ్చింది. ATM మెషిన్, ఆన్‌లైన్, POS నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే పరిమితిని కెనరా బ్యాంక్ పెంచింది. కెనరా బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు కస్టమర్లు మునుపటి కంటే ఎక్కువ డబ్బును తీసుకోవచ్చని పేర్కొంది. ప్లాటినం/బిజినెస్/సెలెక్ట్ డెబిట్ కార్డ్‌ల్లో బ్యాంక్ నగదు లావాదేవీల పరిమితిని రోజుకు రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచింది. POS/E-కామర్స్ లావాదేవీల కోసం రోజువారీ లావాదేవీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది.

పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్లు
అయితే NFC(కాంటాక్ట్‌లెస్) లావాదేవీల కోసం రోజువారీ లావాదేవీ పరిమితి రూ.25,000గా నిర్ణయించింది. పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల ద్వారా టైర్ III, VI నగరాల్లో రోజుకు రూ. 2000, టైర్ I & II నగరాల్లో రూ. 1000 చొప్పున విత్ డ్రా చేసుకోవచ్చని కెనరా బ్యాంక్ పేర్కొంది.
ATM నగదు ఉపసంహరణ, పాయింట్ ఆఫ్ సేల్ (POS), ఇ-కామర్స్ లావాదేవీల కోసం రోజువారీ డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిని బ్యాంక్ వెంటనే అమలులోకి తీసుకొచ్చింది.

కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, జారీ చేయబడిన డిఫాల్ట్ కార్డులు ATMలు, POSలలో గృహ వినియోగం కోసం మాత్రమే. కార్డ్ జారీ సమయంలో అంతర్జాతీయ, ఆన్‌లైన్, ఇ-కామర్స్ లావాదేవీలు అనుమతించరు. ATM, బ్రాంచ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IVRS ద్వారా ఛానెల్‌ల వారీగా కార్డ్‌ను యాక్టివేట్ చేయడానికి లేదా డీయాక్టివేట్ చేయడానికి, పరిమితిని సెట్ చేయడానికి కస్టమర్‌లకు సౌకర్యం ఇచ్చారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ లావాదేవీ పరిమితిని పెంచాలని భావిస్తోంది. ఇదే జరిగితే, బ్యాంక్ మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్‌ల పరిమితి పెరగనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications