FD Rates: విపరీతమైన వడ్డీనిస్తున్న ప్రభుత్వ బ్యాంకులు.. వారికి మాత్రం ప్రత్యేక ఆఫర్

Fixed Deposits: మోదీ ప్రభుత్వం దేశీయ బ్యాంకింగ్ రంగంపై దృష్టి పెట్టిన తర్వాత దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల తలరాత మారిపోయింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. నష్టాల నుంచి దాటుకుని ఈ బ్యాంకులు ప్రస్తుతం లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలో ఖాతాదారులకు, ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను తెచ్చిపెడుతున్నాయి.

ప్రైవేటు బ్యాంకులకు పోటీగా..

ప్రైవేటు బ్యాంకులకు పోటీగా..

ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే క్రమంలో సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను పెంచటంతో పొదుపు ఖాతాదారులకు మంచిరోజులు వచ్చాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను నిరంతరం పెంచుతూనే ఉన్నాయి. చాలా ప్రభుత్వ బ్యాంకులు సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతానికి పైగా వడ్డీని ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోటీగా ప్రత్యర్థి బ్యాంకులను అధిగమిస్తూ కస్టమర్లకు వడ్డీ ఇచ్చేందుకు ఈ మూడు బ్యాంకులు పోటీపడుతున్నాయి.

కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లు..

కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లు..

ప్రస్తుతం కెనరా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి 3.25 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఈ క్రమంలో బ్యాంక్ 7-45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 46-90 రోజులు, 91-179 రోజుల డిపాజిట్లపై 4.50 శాతం చొప్పున వడ్డీ అందుతోంది. ఇదే క్రమంలో 180-269 రోజులు, 270 రోజుల నుంచి ఏడాది లోపు కాలానికి 5.50 శాతం వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ ఒక సంవత్సరం కాలవ్యవధికి FDపై 6.75 శాతం రాబడిని అందిస్తోంది. సంవత్సరం కంటే ఎక్కువ రెండేళ్ల కంటే తక్కువ కాలానికి వేసే డిపాజిట్లకు బ్యాంక్ ఏకంగా 6.80 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తోంది.

అత్యధిక వడ్డీ రేటు..

అత్యధిక వడ్డీ రేటు..

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంకు 666 రోజుల వ్యవధిలో డిపాజిట్లపై అత్యధికంగా 7 శాతం వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ రెండేళ్ల కంటే ఎక్కువ 3 సంవత్సరాల లోపు డిపాజిట్లపై 6.80 శాతం వడ్డీని చెల్లిస్తోంది. కెనరా బ్యాంక్ 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం పాటు పన్ను ఆదా చేసే FDలపై 6.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేట్లన్నీ రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఈ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. పైన వెల్లడించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 19, 2022 నుంచి అమలులో ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్..

పంజాబ్ నేషనల్ బ్యాంక్..

ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం విలీనం తర్వాత లాభాల బాటపట్టింది. పైగా నీరవ్ మోదీ కుంభకోళం తర్వాత బ్యాంక్ చాలా నష్టాలను చవిచూసింది. అయితే ప్రస్తుతం బ్యాంక్ పనితీరు మెరుగుపడగా జనవరి 1, 2023 నుంచి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది. 7-45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 3.50 శాతం వడ్డీని చెల్లిస్తూనే ఉంది. 46- 179 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై బ్యాంక్ 4.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అలాగే 180 రోజుల నుంచి ఏడాది లోపు మెచ్యూర్ అయ్యే FDలపై 5.50 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే 665 రోజులకు చేసే డిపాజిట్లపై వడ్డీని 45 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 6.30 శాతం నుంచి 6.75 శాతానికి చేరుకుంది.

ప్రత్యేక వడ్డీ రేటు..

ప్రత్యేక వడ్డీ రేటు..

అత్యధిక కాలానికి డిపాజిట్ చేసే వారికి ప్రోత్సాహకంగా బ్యాంక్ ప్రత్యేక వడ్డీ రేటును అందిస్తోంది. 667 రోజుల నుంచి 2 ఏళ్ల లోపు, 2 ఏళ్ల కంటే ఎక్కువ నుంచి మూడేళ్లలోపు వరకు ఉండే కాలానికి బ్యాంక్ 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. గతంలో ఈ కాలాలకు కేవలం 6.30 శాతం వడ్డీని బ్యాంక్ అందించేది. PNB 666 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు 7.25 శాతం చొప్పున వార్షిక రాబడిని ఇస్తోంది. PNB సీనియర్ సిటిజన్లకు FDలపై అదనంగా 0.50 శాతం వడ్డీని కూడా ఆఫర్ చేస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా..

బ్యాంక్ ఆఫ్ బరోడా..

బ్యాంక్ ఆఫ్ బరోడా 'బరోడా ట్రైకలర్ ప్లస్' పేరుతో డిపాజిట్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. 399 రోజుల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.05 శాతం రాబడిని అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది. ఇతర బ్యాంకుల మాదిరిగానే.. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీని ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ పొదుపు డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీని అందిస్తోంది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. ఈ రేట్లు డిసెంబర్ 26, 2022 నుంచి అమలులో ఉన్నాయని బీవోబీ వెల్లడించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+