Canara Bank: ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ దిగ్గజం కెనరా బ్యాంక్ నేడు తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీనిలో ఆస్తుల నాణ్యతను పెంచుకున్న కంపెనీ సూపర్ లాభాలను నమోదు చేసింది.
వివరాల్లోకి వెళితే బ్యాంక్ జనవరి-మార్చి త్రైమాసిక కాలనికి రూ.3,757.23 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 18.4 శాతం అధికం కావటం గమనార్హం. రిపోర్టింగ్ కాలంలో కంపెనీ ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, నికర వడ్డీ ఆదాయం పెరగటం త్రైమాసిక లాభాల్లో అద్భుతమైన వృద్ధికి దోహదపడింది. అలాగే స్థూల నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ నిష్పత్తి ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో 4.39 శాతం నుంచి మెరుగుపడి 2024 మార్చి త్రైమాసికంలో 4.23 శాతానికి చేరుకున్నాయి.

రిపోర్టింగ్ త్రైమాసికంలో బ్యాంక్ తాజా స్లిపేజ్‌లు రూ.3,082 కోట్లకు పెరిగాయి. ఇది ఏడాది కిందటి త్రైమాసికంలో రూ.2,857 కోట్లుగా ఉన్నాయి. అలాగే రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ రుణాలు మార్చి 31 నాటికి డిసెంబర్ త్రైమాసికం కంటే తగ్గి రూ.3,897కి చేరుకున్నాయి.
కానీ వార్షిక ప్రాతిపదికన పెరిగింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.18 శాతం పెరిగి రూ.9,580 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ మార్చి 31, 2024 నాటికి 3.07 శాతంగా ఉన్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ ఒక్కో షేరుపై రూ.16.10 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
మార్చి 31, 2024 నాటికి గ్లోబల్ వ్యాపారం 11.31 శాతం పెరిగి రూ.2.28 లక్షల కోట్లకు చేరుకుంది. గ్లోబల్ డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 11.29 శాతం పెరిగి రూ.1.31 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదే క్రమంలో స్థూల గ్లోబల్ అడ్వాన్స్‌లు రూ.9.60 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదే క్రమంలో బ్యాంక్ దేశీయ డిపాజిట్ మార్చి 31, 2024 నాటికి 10.98 శాతం వృద్ధితో రూ.1.22 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
మార్చి 31 నాటికి రిటైల్ లెండింగ్ పోర్ట్‌ఫోలియో 11.68 శాతం పెరిగి రూ.1.56 లక్షల కోట్లకు చేరుకోగా.. హౌసింగ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఏడాది ప్రాతిపదికన 10.81 శాతం వృద్ధితో రూ.93,482 కోట్లకు చేరుకుంది. అలాగే వ్యవసాయం & అనుబంధ రంగాల అడ్వాన్స్‌లు ఏడాదికి 18.69 శాతం పెరిగి రూ.2.53 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలో నేడు సాయంత్రం 3.26 సమయంలో ఎన్ఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ ధర 3.52 శాతం క్షీణించి రూ.556.50 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications