IT News: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై కెనడా చర్యలు.. ట్రూడో ప్రభుత్వం నిర్ణయం..
Infosys News: దేశంలోని టాప్-5 టెక్ దిగ్గజ సంస్థలో ఒకటి ఇన్ఫోసిస్. భారత్ తో పాటు మరికొన్ని దేశాల్లో ఐటీ సేవల సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం టెక్ కంపెనీకి షాక్ ఇచ్చింది.
తాజాగా ఇన్ఫోసిస్ కెనడాలో రూ.82 లక్షల పెనాల్టీకి గురైనట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. కెనడాలో అధికారంలో ఉన్న జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ప్రభుత్వం భారతీయ ఐటీ కంపెనీపై 1.34 లక్షల కెనడియన్ డాలర్ల పెనాల్టీగా విధించిందని వెల్లడైంది. డిసెంబర్ 31, 2020తో ముగిసిన సంవత్సరానికి ఉద్యోగి ఆరోగ్య పన్నును తక్కువగా చెల్లించినందుకు ఈ పెనాల్టీ విధించబడినట్లు అక్కడి ప్రభుత్వం ఆరోపించింది.

నివేదిక ప్రకారం బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్‌కు కెనడా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి గత వారం పెనాల్టీ ఆర్డర్ కంపెనీ అందుకుంది. ఈ క్రమంలో కంపెనీపై 1,34,822.38 కెనడియన్ డాలర్ల జరిమానా విధించినట్లు పేర్కొంది. ఇదే విషయాన్ని కంపెనీ తాజాగా తన రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. తాజాగా కెనడియన్ పెనాల్టీపై స్పందించిన ఇన్ఫోసిస్.. కెనడా ప్రభుత్వ చర్యలు కంపెనీ కార్యకలాపాలు, ఫైనాన్షియల్స్ పై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. ఇండియా తర్వాత ఐటీ దిగ్గజం కెనడాలో ప్రధానంగా వ్యాపార ఉనికిని కలిగి ఉంది. కంపెనీ ఆ దేశంలోని అల్బెర్టా, మిసిసాగా ఆఫ్ అంటారియో, బర్నబీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, అంటారియోలో కార్యాలయాలు ఉన్నాయి.
వాస్తవానికి ఎంప్లాయీ హెల్త్ ట్యాక్స్ అనేది అంటారియో, బ్రిటిష్ కొలంబియా వంటి కెనడియన్ ప్రావిన్సులలోని యజమానులపై విధించబడిన తప్పనిసరి పేరోల్ పన్ను. జీతాలు, బోనస్‌లు, పన్ను విధించదగిన ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్‌లతో సహా వివిధ రకాల ఉద్యోగి పరిహారం ఆధారంగా ఈ పన్ను లెక్కించబడుతుంది. వాస్తవానికి ప్రావిన్స్‌లో ఆరోగ్య సంరక్షణ సేవలకు నిధులను అందించడం దీని ప్రాథమిక లక్ష్యం. ఇక్కడ గమనిస్తే.. అంటారియోలో కంపెనీ యజమానులు హెల్త్ ట్యాక్స్ తప్పనిసరిగా ఉద్యోగుల వేతనంపై చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications