భారత్‌లో EV మార్కెట్ ఊపందుకుంటున్న సమయానికే ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలపై GST పెంపు చర్చ మొదలైంది. ఇప్పటివరకు 5% మాత్రమే ఉన్న GSTని, రూ.20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ EVలపై 18%కి పెంచాలని ప్రతిపాదన వచ్చింది.

ఇంకా ఫైనల్ డెసిషన్ GST కౌన్సిల్ తీసుకోవాలి కానీ, ఈ వార్త ఒక్కటే ఆటో ఇండస్ట్రీకి కలవరాన్ని తెచ్చింది. ఎందుకంటే, కస్టమర్లు కూడా గందరగోళంలో పడిపోయి తమ కొనుగోలు డిసిషన్స్ వాయిదా వేస్తున్నారని కంపెనీలు చెబుతున్నాయి.
టాటా మోటార్స్, మెర్సిడెస్, BMW, JSW MG వంటి పెద్ద ప్లేయర్స్ అందరూ ఒకే మాట చెబుతున్నారు. 5% GST వల్లే ఇప్పటివరకు EVలు వేగంగా గ్రోత్ అయ్యాయి. రేంజ్, చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, SUV సెగ్మెంట్లలో ICE వాహనాలతో ప్రైస్ ప్యారిటీ... ఇవన్నీ జరిగిందంటే తక్కువ ట్యాక్స్ వల్లే.
BMW ఇండియా CEO హర్దీప్ సింగ్ బ్రార్ మాటల్లో "GST పెంచుతారనే వార్తలతోనే కస్టమర్లు వెనుకడుతున్నారు. ఈ అన్‌సర్టైన్టీ సేల్స్‌ను డైరెక్ట్‌గా ప్రభావితం చేస్తోంది." జూలైలో 15,500కుపైగా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 93% జంప్. మొత్తం ప్యాసింజర్ వెహికిల్ మార్కెట్‌లో EVల వాటా దాదాపు డబుల్ అయి 4.7%కి చేరింది.
కానీ నిపుణులు హెచ్చరిస్తున్నారు "ఇలాగే కొనసాగాలంటే పాలసీ స్టేబుల్‌గా ఉండాలి. ఒకసారి ట్యాక్స్ పెరిగితే దాని ఇంపాక్ట్ కేవలం లగ్జరీ EVలకే కాకుండా మొత్తం ఇండస్ట్రీ మీద పడుతుంది."
ఒక ఉదాహరణగా తీసుకుంటే ఓ EV కారు (ex-showroom price) రూ. 25 లక్షల ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే, ఇప్పుడున్న 5% GSTతో దాని ధర సుమారు రూ. 26.25 లక్షలు అవుతుంది. కానీ GST 18%కి పెరిగితే అదే కారు ధర రూ. 29.50 లక్షలకు పెరుగుతుంది. అంటే కస్టమర్‌కి ఒక్కసారిగా దాదాపు రూ. 3.25 లక్షలు అదనంగా భారం పడుతుంది. పెద్ద EVలు కొనాలనుకునే వారికి ఇది మంచి షాక్.
కార్ కంపెనీల క్లియర్ మెసేజ్ EVలపై 5% GSTని కొనసాగించాలి. ఎందుకంటే ఇది కేవలం "ట్యాక్స్" విషయం కాదు, ఇండియా క్లీన్ మొబిలిటీ ఫ్యూచర్‌కు పునాది. GST పెరిగితే EV రివల్యూషన్‌కి బ్రేక్ పడే అవకాశం ఉందని అన్ని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.
GST పెంపు ప్రీమియం EVలకు మాత్రమే అనిపించినా, దీని ఇంపాక్ట్ మొత్తం EV మార్కెట్ మీద ఉంటుంది. కస్టమర్ కాన్ఫిడెన్స్, కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్, మార్కెట్ స్పీడ్ అన్నీ స్లో అవుతాయి.
EV డిమాండ్ మొదట ప్రీమియం కార్ల దగ్గర స్లో అయితే, తర్వాత మాస్ మార్కెట్‌లో కూడా ఆటోమేటిక్‌గా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే EVల అడాప్షన్ ప్యాటర్న్ ఎప్పుడూ "లగ్జరీ నుంచి మాస్" వైపు వెళ్తుంది. అంటే రిచ్ వాళ్లు కొత్త టెక్నాలజీని మొదట ట్రై చేస్తారు, తర్వాత అది మామూలు మార్కెట్‌కి వస్తుంది. అలాంటప్పుడు, డిమాండ్ తగ్గితే కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా రిస్క్‌లో పడతాయి. కొత్త EV ప్రాజెక్టులు, బ్యాటరీ ఫ్యాక్టరీలు, చార్జింగ్ స్టేషన్లు అన్నీ బోల్డంత పెట్టుబడులు అవసరమయ్యే పనులు. కానీ పాలసీ మీద క్లారిటీ లేకపోతే, భవిష్యత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా స్లో అవ్వడం ఖాయం.


Click it and Unblock the Notifications