ఈ ఏడాది అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను నిబంధనలలో చాల మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. అయితే, లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA)పై పన్ను మినహాయింపు కొత్త పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకున్న వారికి కూడా లభిస్తుందా అనే డౌట్ చాలా మందిలో ఉంది. దీనికి సమాధానం ఏంటో తెలుసా...

కొత్త పన్ను విధానంలో LTA మినహాయింపు ఉండదు: కొత్త పన్ను విధానంలో LTA (లీవ్ ట్రావెల్ అలవెన్స్)పై పన్ను మినహాయింపుకు ఎటువంటి నిబంధన లేదు. అందువల్ల మీరు ఈ బెనిఫిట్ సద్వినియోగం చేసుకోలేరు. మీరు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకుంటే, మీ జీతంలో LTA కూడా ఉంటే అప్పుడు ఆ మొత్తం పై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు బిల్లులు సమర్పించినా సమర్పించకపోయినా ఇది వర్తిస్తుంది. మీరు మీ కంపెనీ నుండి LTA పొంది కొత్త పన్ను విధానం కింద టీడీఎస్ (TDS) తగ్గించుకునే అప్షన్ కావాలనుకుంటే ఆ మొత్తం మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో చేర్చబడుతుంది. అంటే LTAపై మినహాయింపు సౌకర్యం పాత పన్ను విధానంలో మాత్రమే ఉంది.
LTA మినహాయింపు నియమాలు: LTAపై పన్ను మినహాయింపు ప్రతి సంవత్సరం లభించదు. ఈ సౌకర్యం నాలుగు సంవత్సరాల బ్లాక్‌లో రెండుసార్లు మాత్రమే ఉంటుంది. ప్రస్తుత బ్లాక్ 1 జనవరి 2022న ప్రారంభమై 31 డిసెంబర్ 2025న ముగుస్తుంది. ఈ కాలంలో మీరు రెండు ప్రయాణాలకు LTA మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఉద్యోగి ఈ బ్లాక్‌లో ఒకే ఒకసారి ప్రయాణం చేసి ఉంటే అతను ఆ ప్రయాణాన్ని నెక్స్ట్ బ్లాక్‌లోని మొదటి సంవత్సరానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే నియమాలు: LTA మినహాయింపు నియమాలు ప్రైవేట్ ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరికీ సాధారణం. కాబట్టి రెండు వర్గాల ఉద్యోగులు పాత పన్ను విధానాన్ని తీసుకుంటే నాలుగు సంవత్సరాల బ్లాక్‌లో రెండుసార్లు మినహాయింపు పొందవచ్చు. అలాగే భారతదేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఉదాహరణకు, మీరు ప్రయాణం కోసం రూ. 40,000 ఖర్చు చేసి మీ కంపెనీ నుండి జీతం ప్యాకేజీలో LTA మొత్తం రూ. 30,000 అయితే మీకు రూ. 30,000 వరకు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి, మీరు పన్ను ప్రయోజనాల కోసం LTAను క్లెయిమ్ చేయాలనుకుంటే మీరు పాత పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications