బెంగళూరులో నెలకు రూ. 3.2 లక్షలు సంపాదించే కుటుంబం రూ. 2.4 కోట్ల అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయగలదా? అనే ప్రశ్నను ఒక 34 ఏళ్ల రెడ్డిట్ వినియోగదారు పోస్ట్ చేసిన తర్వాత అది చర్చకు వేదికయింది. ఈ అంశం ఆర్థిక ప్రణాళిక, గృహ రుణాలు, వేగంగా పెరుగుతున్న బెంగళూరు ప్రాపర్టీ మార్కెట్‌పై అనేక రకాలైన చర్చలకు దారితీసింది. ఈ జంట ప్రస్తుతం అద్దెకు ఉంటూ, తమ స్వంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
Bengaluru లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో డెవలప్‌మెంట్-లింక్డ్ ప్లాన్ కింద అపార్ట్‌మెంట్ కొనుగోలు గురించి ఆలోచిస్తున్నట్లు ఆ వినియోగదారు వివరించారు. మొత్తం విలువ సుమారు రూ. 2.4 కోట్లు కాగా, వారు తమ పొదుపు నుండి 10 శాతం అంటే రూ.20 నుంచి రూ. 25 లక్షల ప్రారంభ సహకారం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగిలిన మొత్తం కోసం రూ. 1.8 కోట్ల హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారు. వచ్చే రెండేళ్ళ నిర్మాణ కాలంలో అదనంగా రూ. 30 నుంచి రూ. 40 లక్షలు చెల్లించగల సామర్థ్యం ఉన్నదని తెలిపారు.

తమ CIBIL స్కోరు 795 కాబట్టి, 7.65 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ రేటు పొందగలమని అంచనా వేశారు. పన్నుల తర్వాత నెలకు రూ. 3.2 లక్షల స్థిరమైన ఆదాయం, వేరియబుల్ ఇన్కమ్ కలిపితే సుమారు రూ. 3.7 లక్షల వరకు చేరుతుందని కూడా చెప్పారు. ఇద్దరూ ఉద్యోగులు ఒకరు స్థిరమైన టెక్ ప్రోడక్ట్ కంపెనీలో రిమోట్‌గా పనిచేస్తున్నారు, మరొకరు ప్రముఖ MNCలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, ఈ ఆలోచనపై రెడ్డిట్ వినియోగదారులలో అభిప్రాయాలు విభేదించాయి.
పెద్ద భాగం ఈ కొనుగోలు ఆర్థిక పరంగా ప్రమాదకరమని హెచ్చరించింది. EMI దాదాపు నెలకు రూ. 1.7 నుంచి 1.8 లక్షలు ఉండే అవకాశం ఉండటంతో, కుటుంబ ఆదాయంలో దాదాపు 40 శాతం రుణ చెల్లింపులకు వెళ్తుందని, మిగతా ఖర్చులకు తక్కువ మిగులుతుందని వారు పేర్కొన్నారు. కొందరు మరింత గట్టిగా మాట్లాడుతూ..FDల్లో నిల్వలు ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదని, ఆ మొత్తాన్ని తక్షణపు ప్రిన్సిపల్ చెల్లింపులకు ఉపయోగిస్తే మంచిదని సూచించారు.
అయినప్పటికీ, కొనుగోలులో కనిపించని ఖర్చులు చాలా ఉంటాయని పలువురు తెలిపారు. హ్యాండ్‌ఓవర్ సమయంలో రిజిస్ట్రేషన్, GST, ఇంటీరియర్ వర్క్ కలిసి కనీసం రూ. 40 నుంచి రూ. 50 లక్షలు అదనంగా అవసరమవుతుందని చాలా మంది తెలిపారు. ఈ జంట రిమోట్‌గా పనిచేస్తున్నందున ఎంపిక చేసిన ప్రాంతం ప్రయోజనం ఇస్తుందా అనే ప్రశ్న కూడా చర్చలో వచ్చింది. ఇదే సమయంలో కొంతమంది ఇల్లు కొనడం పూర్తిగా గణితం కాదు, భావోద్వేగ పెట్టుబడి కూడా అని పేర్కొన్నారు.
EMI 40 శాతంకు చేరినా, disciplined budgeting ఉంటే నిర్వహించవచ్చని వాదించారు. ఇటీవల అలాంటి పరిస్థితుల్లో ఇల్లు కొనుగోలు చేసిన ఒకరు చెప్పిన ప్రకారం.. ప్రారంభంలో 30 సంవత్సరాల రుణ లోన్ తీసుకొని EMI తగ్గించి, occupation తర్వాత aggressive pre-payment చేయడం ఉత్తమ మార్గం అవుతుందని సూచించారు. బ్యాంక్ రుణాన్ని ఆమోదిస్తే, మీరు repay చేయగలరని వాళ్లు నమ్ముతున్నారని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే, emergency కోసం కనీసం రూ. 40 నుంచి రూ. 50 లక్షల buffer తప్పనిసరిగా ఉంచాలని చాలా మంది ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల గురించి ఆలోచించడం కూడా కీలకం అని చాలా మంది సూచించారు. EMI, కుటుంబ ఖర్చులు కలిసి ఆదాయంలో 70 శాతానికి చేరితే, భవిష్యత్తులో పిల్లల విద్య, ఆరోగ్య అత్యవసరాలు, ప్రయాణం, పదవీ విరమణల కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం తగ్గిపోతుందని హెచ్చరించారు. ఇల్లు కొనడం పెద్ద నిర్ణయం, అయితే అది ఆనందం, ఒత్తిడిని రెండింటినీ కలిగించగలదని వారు గుర్తు చేశారు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications