చాలా మంది మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు..సలహాదారుల సాంప్రదాయిక రుణ పెట్టుబడిదారులను ఓవర్‌నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ వంటి 'సురక్షితమైన' స్వల్పకాలిక ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్‌లకు మీడియం నుంచి లాంగ్ డ్యూరేషన్ డెట్ మ్యూచువల్ ఫండ్ల గురించి ఎక్కువగా చెప్పరు.
దీర్ఘకాలిక డెట్ ఫండ్లలో కొన్ని రిస్కులు ఉంటాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు వారు డబ్బును కోల్పోతారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. దీర్ఘకాలిక డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి వడ్డీ సర్క్యులేషన్ గురించి తెలిసి ఉండాలి. ఎప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతాయి.. ఎప్పుడు పెరుగుతాయి అనేది తెలియాలి.

రిస్క్ తీసుకోవాలనుకొనేవారు, దీర్ఘ పెట్టుబడి హోరిజోన్ ఉన్నవారు సమర్థ మ్యూచువల్ ఫండ్ సలహాదారుల సహాయంతో ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం మంచిది. 2024లో పెట్టుబడి పెట్టాలనుకొనేవారికి ఉత్తమమైన మీడియం నుంచి లాంగ్ డ్యూరేషన్ (Debt Funds) డెట్ ఫండ్స్ ను నిపుణులు చూచిస్తున్నారు. అందులో (SBI) ఎస్బీఐ మాగ్నమ్ ఇన్‌కమ్ ఫండ్, (ICICI) ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బాండ్ ఫండ్, (Adithya Birla) ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్‌కమ్ ఫండ్ ఉన్నాయి.
డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలను షార్ట్‌లిస్ట్ చేయడానికి పలు పద్ధతులు పాటించాలి. మీన్ రోలింగ్ రిటర్న్స్ ను గమనించుకోవాలి. గత మూడు సంవత్సరాలలో స్థిరత్వాన్ని గమనించాలి మరియు అవుట్‌పెర్‌ఫార్మెన్స్ ను కూడా పరిశీలించాలి.
Note: ఇది కేవలం సమాచారం మాత్రమే. దీనికి గుడ్ రిటర్న్స్ తెలుగు సంబంధం లేదు. మీరు పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications